జాతీయ వార్తలు

నేను దిగితే అంతే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, అక్టోబర్ 16: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ వ్యవహార శైలియే కాదు, ఆయన మాట తీరు భిన్నంగానే ఉంటుంది. అనేక వివాదాలకు కేంద్ర బిందువు కావడమే కాకుండా, ఇతరత్రా పార్టీ వ్యవహారాల్లోనూ కల్లోలం రేపిన దిగ్విజయ్ సింగ్ తాజాగా మధ్యప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు అంతే విస్మయాన్ని కలిగిస్తున్నాయి. అనేక సంవత్సరాల పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేయడంతో పాటు, కాంగ్రెస్ పార్టీ జాతీయ వ్యవహారాల్లోనూ కీలక భూమిక పోషించిన దిగ్విజయ్ సింగ్ తాజా వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఏ నాయకుడైనా పార్టీ అధినాయకత్వం మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తాడు. ముఖ్యంగా ఎన్నికల సమయాల్లో ప్రచార బాధ్యతను భుజానకెత్తుకొని అధిష్ఠానం ఆదరణ పొందాలనుకుంటాడు. కానీ, మధ్య ప్రదేశ్‌లో ఏళ్ల తరబడి రాజకీయ చక్రం తిప్పిన దిగ్విజయ్ సింగ్ మాత్రం రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి తను తగనట్టున్నాడు. అంతేకాదు, తాను కనక రంగంలోకి దిగి ప్రచారం చేస్తే మాత్రం కాంగ్రెస్‌కు రావాల్సిన ఓట్లు కూడా రావని దిగ్విజయ్ చెప్పడం తీవ్ర కలకలం రేపుతోంది. దిగ్విజయ్ వ్యాఖ్యలకు సంబంధించి వీడియో ఈనెల 13న రికార్డు అయినప్పటికీ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మధ్య ప్రదేశ్‌లో ప్రచారం చేపట్టిన రోజే అది విడుదల కావడం గమనార్హం. గత కొన్ని వారాలుగా రాష్ట్రంలో రాహుల్‌గాంధీ అనేక ర్యాలీల్లో పాల్గొన్నారు. బహిరంగ సభల్లో మాట్లాడారు. వాటిలో ఎక్కడా కూడా దిగ్విజయ్ సింగ్ పాల్గొన్న దాఖలాలు లేవు. ఇంతకీ ద్విగ్విజయ్ సింగ్ ఎందుకు పార్టీ ప్రచారానికి దూరంగా వున్నారు? కాంగ్రెస్‌ను గద్దెనెక్కించడానికి క్రియాశీలకంగా ఎందుకు ముందుకు రావడం లేదు? అన్నది చర్చనీయాంశంగా మారింది. ‘ప్రచారంలో పాల్గొనను ఎలాంటి ప్రసంగాలు చేయను ఇదే నా పని. నేను గనక మాట్లాడితే కాంగ్రెస్‌కు పడాల్సిన ఓట్లు కూడా పడవు. ఆ నష్టం నేనెందుకు చేయాలి? అందుకే వౌనంగా ఉండటమే, అదీ..పార్టీ ప్రచారానికి దూరంగా ఉండటమే మేలు అనుకుంటున్నాను’ అని దిగ్విజయ్ ఆ వీడియోలో పేర్కొన్నట్లుగా అయితే తాను పార్టీ కార్యకర్తల సమావేశంలో అనేక అంశాలను ప్రస్తావించానని, అన్యపదేశంగా వచ్చిన ఈ మాటలనే చూపిస్తున్నారని దిగ్విజయ్ తాజా పరిణామాలపై స్పందించారు. కాగా, తాజా వీడియో అంశాల్ని అధికార బీజేపీ గట్టిగా అందిపుచ్చుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పది సంవత్సరాల పాటు పనిచేసిన దిగ్విజయ్ సింగ్ పట్ల కాంగ్రెస్ నాయకత్వం ఇంత చులకన భావాన్ని ప్రదర్శించడం తగదని అధికార బీజేపీ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రచారానికి సంబంధించి దిగ్విజయ్ సింగ్‌కు తగిన ప్రధాన్యత ఇవ్వడం లేదనీ, అందుకే ఆయన మనస్తాపంతోని ఈ వ్యాఖ్యలు చేశారని చౌహాన్ అన్నారు.