జాతీయ వార్తలు

మరింతగా రక్షణ బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: రక్షణ సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని భారత్-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లు నిర్ణయించాయి. ఇరు దేశాల సైన్యం సాంకేతిక విజ్ఞానాన్ని పంచుకోవడం, శిక్షణ, రక్షణ ఉత్పత్తుల రంగంలోనూ కలిసి ముందుకు సాగాలని సంకల్పించాయి. భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, యూఏఈ రక్షణ శాఖ సహాయ మంత్రి బొవార్డి అల్ ఫలాసీల మధ్య మంగళవారం జరిగిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరింది. ఇప్పటి వరకూ ఇరు దేశాల మధ్య సాగిన రక్షణ సహకారాన్ని సమీక్షించిన ఇరు దేశాల మంత్రులు భవిష్యత్‌లో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అంశంపై దృష్టి సారించారు. ఇరు దేశాల సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరుకోవాలంటే ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత విస్తృతం చేసుకోవడమే కీలకమన్న అభిప్రాయం ఇరు దేశాల నేతల్లో వ్యక్తమైంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య సంబంధాలు ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూనే ఉన్నాయి.రక్షణ, భద్రతాపరమైన మైత్రీ బంధాన్ని పెంపొందించుకునేందుకు ఇరు దేశాల మధ్య ఈ ఏడాది జనవరిలో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది.2015లో ప్రధాని మోదీ యూఏఈలో పర్యటించడం, ఆ దేశ యువరాజు జాయద్ అల్ నహ్యాన్ 2016లో ఢిల్లీ రావడం ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. రెండు దేశాల మధ్య వార్షిక వాణిజ్యం 53బిలియన్ డాలర్ల మేర ఉంది. భారత దేశ మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశంగా యూఏఈ కొనసాగుతోంది.

చిత్రం.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రక్షణ శాఖ సహాయ మంత్రి అల్ బొవార్డితో
మంగళవారం ఢిల్లీలో కరచాలనం చేస్తున్న భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్