జాతీయ వార్తలు

జేడీయూ ఉపాధ్యక్షుడిగా ప్రశాంత్ కిశోర్ నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, అక్టోబర్ 16: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎన్నికల విజయాల్లో కీలక భూమిక పోషించిన వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ జేడీయూ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ నియామకం ద్వారా బీహార్ అధికార పార్టీలో కిశోర్‌ది నెంబర్-2 స్థానమన్న విషయాన్ని విస్పష్టంగా తెలిపారు. కిశోర్ నియామకం వల్ల తమ సాంప్రదాయక మద్దతు దారులకు మరింత చేరువయ్యే అవకాశం ఉంటుందని జెడియూ ప్రతినిధి కేసీ త్యాగి అన్నారు. ఐక్యరాజ్య సమితి నిర్వహించిన ప్రజారోగ్య కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రశాంత్ కిశోర్ 2014 ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీకి సన్నిహితంగా మెలిగారు. తర్వాత బీజేపీకి దూరమైన ఆయన 2015 ఎన్నికల్లో బీహార్‌లో ప్రతిపక్షాల విజయంలో కీలక భూమిక పోషించారు. ఆ విజయం నేపథ్యంలో నితీశ్ కుమార్‌కు ప్రశాంత్ కిశోర్‌కు మధ్య మరింతగా సాన్నిహిత్యం బలపడిందని పార్టీ వర్గాలు తెలిపాయి.