జాతీయ వార్తలు

అలహాబాద్ కాదు.. ప్రయాగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో/ గోరఖ్‌పూర్, అక్టోబర్ 16: అలహాబాద్ నగరం పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చాలనే ప్రతిపాదనకు ఉత్తరప్రదేశ్ కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. అలహాబాద్ నగరం పేరును మార్చడాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం లెక్కచేయలేదు. ఈ నగరానికి ఉన్న పాత పేరునే పునరుద్ధరించినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. ‘అక్బర్ చేసిన పొరపాటును ఈ రోజు బీజేపీ ప్రభుత్వం సరిదిద్దింది’ అని బీజేపీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ‘అలహాబాద్ పేరు 500 సంవత్సరాల క్రితం ప్రయాగ్‌రాజ్. ఎందుకంటే అది త్రివేణి సంగమం. ఈ విషయంలో ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మా ప్రభుత్వం అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చింది’ అని తరువాత ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌లో చెప్పారు. రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం పొందడం వల్ల ఈ ప్రతిపాదన ఇప్పుడు కేంద్రం ఆమోదం కోసం పంపవలసి ఉంటుంది. కేంద్రం ఆమోదించిన తరువాతనే అలహాబాద్ పేరు అధికారికంగా మారుతుంది. అయితే, ఉత్తరప్రదేశ్ సీనియర్ మంత్రి సిద్ధార్థ నాథ్ సింగ్ మాత్రం అలహాబాద్ పేరు మారిపోయినట్టుగానే మాట్లాడారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగిన అనంతరం సిద్ధార్థ నాథ్ సింగ్ విలేఖరులతో మాట్లాడుతూ ‘అలహాబాద్ ఇప్పటి నుంచి ప్రయాగ్‌రాజ్ పిలువబడుతుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను’ అని ఆయన అన్నారు. ‘ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ మార్పు ఈ రోజునుంచే అమలులోకి వచ్చింది’ అని సింగ్ అన్నారు.