జాతీయ వార్తలు

శబరిమలలో తగ్గని సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంబ, అక్టోబర్ 21: పవిత్ర శబరిమల పర్వతాలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఇద్దరు మహిళలను ఆదివారం భక్తులు అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన సుమారు నలభై యేళ్ల వయసున్న ఈ ఇద్దరు మహిళలు తమ బంధువులతోబాటు కొండ ఎక్కేందుకు రాగా ‘స్వామియే శరణమయ్యప్పా’ అంటూ నినాదాలు చేస్తూ భక్తులు నీలిమల వద్ద వారిని అడ్డగించారు. ఈ ఆలయ ఆచారాలు తెలియకుండా ఆ మహిళలు ఇక్కడికి వచ్చారని తెలుస్తోంది. కాగా పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది ఆ మహిళలకు రక్షణగా నిలిచారు. వారిని వాహనం పార్కు చేసిన నీలక్కల్ ప్రాంతానికి తరలించారు. ఆ మహిళలతోబాటు వచ్చిన యాభై యేళ్ల పైబడిన మహిళలను మాత్రమే భక్తులు పవిత్ర పర్వతారోహణకు అనుమతించారు. ఈ క్షేత్రంలో వందలాది సంవత్సరాలుగా సాగుతున్న సంప్రదాయాలు, కట్టుబాట్లకు భంగం కలిగించాలన్న ఉద్దేశం తమకు లేదని ఈ సందర్భంగా భక్తులు అడ్డుకున్న మహిళలిద్దరూ రాతపూర్వకంగా పేర్కొన్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి. సుప్రీం కోర్టు తీర్పు అనంతరం నెలవారీ పూజల నిమిత్తం ఆలయ ద్వారాలు తెరుచుకుని ఇప్పటికి ఐదు రోజులు గడిచాయి. శనివారం నాడు ఈ భారీ వర్షం అనంతరం పంబా నది వద్దనుంచి యాత్రకు ఉపక్రమించిన దళిత మహిళను భక్తులు అడ్డుకోవంతో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాగా సుప్రీం కోర్టు నిర్ణయాన్ని అమలు చేయాలన్న సీపీఎం నేతృత్వంలోని కేరళ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని శబరిమల కర్మ సమితి నిర్ణయించింది. ఇందులో భాగంగా నామజప యాత్ర పేరిట నిరసన యాత్ర ఆ ప్రాంతాల్లో పోలీస్‌స్టేషన్ల వద్దకు చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే ఎరుమేలిలో జరిగిన ఈ నిరసన ప్రదర్శనలో వందలాది మంది మహిళలు పాల్గొన్నారు. ఈ వివాదంపై చర్చించేందుకు వెంటనే అసెంబ్లీని సమావేశపర్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్లై డిమాండ్ చేశారు. శబరిమల ఆచారాలకు విఘాతం కలిగించాలన్న నిర్ణయంపై అధికార సీపీఎంలోని వ్యక్తులే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రామచంద్రన్ పిళ్లై మాట్లాడుతూ ఉద్యకారులకు కేరళవాసుల మద్దతులేదని వ్యాఖ్యానించారు. శబరిమల వ్యవహారాల్లో బాధ్యతల నిర్వహణ విషయంలో ఏవైనా లోటుపాట్లుంటే సరిదిద్దుకునేందుకు తమ శాఖ సమీక్షిస్తుందని ఆ రాష్ట్ర పోలీసు చీఫ్ లోక్‌నాథ్ బెహెరా అన్నారు. ఇలావుండగా నెలవారీ పూజ ముగియగానే సోమవారం నుంచి ఈ గుడి తలుపులు తిరిగి మూసివేస్తారు. వచ్చే నెలలో ప్రారంభమయ్యే మండల పూజ నుంచి విధినిర్వహణ తమ శాఖకు ఓ సవాలు కానుందని ఆయన అన్నారు.

చిత్రం..శబరిమలలో ఆదివారం దర్శనానికి వచ్చిన మహిళా భక్తులకు వ్యతిరేకంగా
నినాదాలు చేస్తున్న అయ్యప్ప భక్తులు