జాతీయ వార్తలు

20 లోక్‌సభ సీట్లు మావే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: ఈశాన్య భారత దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్న 25 లోక్‌సభ స్థానాల్లో 20 స్థానాలను బీజేపీ, దాని మిత్రపక్షాలు గెలుచుకోవడం ఖాయమన్న ధీమా ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ ప్రాంతంలో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీతోబాటు మిత్రపక్షాల నుంచి గెలుపొందిన 11 మంది లోక్‌సభ సభ్యులున్నారు. ఇందులో ఏడుగురు అస్సాం రాష్ట్రానికి చెందినవారు కావడం గమనార్హం. కాగా వచ్చే యేడాది ఆరంభంలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రస్తుతం తమ పార్టీకి ప్రాతినిధ్యంలేని పలు చోట్ల కైవసం చేసుకుంటామని ఆ పార్టీ శ్రేణులు ఘంటాపథంగా చెబుతున్నాయి. 2014 పార్లమెంట్ ఎన్నికల నుంచి ఈ ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అస్సాం, త్రిపురల్లో బీజేపీ సొంతంగా పోటీచేసి విజయాలు సాధించింది. ఈ ప్రాంతంలోని మిజోరాం మినహా మిగతా ఏడు ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ లేదా దాని మిత్రపక్షాలే అధికారంలో ఉన్నాయి. అక్కడ తిరిగి ఇదే పరిస్థితి వచ్చే ఎన్నికల్లోనూ పునరావృతం అవుతుందని ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడొకరు విశే్లషించారు. తమ పార్టీ నిర్వహించిన సర్వే ప్రకారం రానున్న ఎన్నికల్లో అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపురల్లోని అన్ని లోక్‌సభ స్థానాల్లో తమ పార్టీకి విజయం తధ్యమని ఆయన చెప్పారు. ఈ రాష్ట్రాల్లో 2014 ఎన్నికల్లో మణిపూర్, త్రిపురల్లో రెండేసి లోక్‌సభ స్థానాల్లో మాత్రమే ఈ పార్టీ గెలుపొందింది. అరుణాచల్ ప్రదేశ్‌లో కేవలం ఒక్కసీటు మాత్రమే కైవసం చేసుకున్నారు. ఇలావుండగా అస్సాంలో కూడా ఈ దఫా తొమ్మిది లోక్‌సభ స్థానాలను దక్కించుకుంటామని సర్వేల్లో తేలిందని ఆ పార్టీ తరపున దక్షిణాదిన ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న మరోనేత చెప్పారు.