జాతీయ వార్తలు

25నుంచి ఇండియా మొబైల్ కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: దేశంలో టెలికం పరిశ్రమ ఎదుర్కొంటున్న కీలకాంశాలపై ఈ నెల 25నుంచి 27 వరకు జరుగనున్న ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్’లో చర్చించనున్నారు.
దేశంలోని ప్రధాన టెలికం కంపెనీల అధినేతలు ఈ వేదికను పంచుకోనున్నారు. ఈ కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం, రిలయన్స్ జియో చైర్మన్ ముకేశ్ అంబానీ, భారతి ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ 25న ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. వొడాఫోన్ ఐడియా చైర్మన్ కుమార్ మంగళం బిర్లా కూడా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని భావిస్తున్నారు. ‘ఈ మూడు టెలికం కంపెనీల ప్రమోటర్లు ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)లో పాల్గొంటారని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ ఒక వార్తాసంస్థకు చెప్పారు. ప్రధాన టెలికం కంపెనీలకు చెందిన చీఫ్ టెక్నాలజి అధికారులు, చీఫ్ మార్కెటింగ్ అధికారులు ఈ కార్యక్రమంలో వివిధ బిజినెస్ ప్రతిపాదనలపై చర్చించే అవకాశం ఉందని ఆయన వివరించారు. అమెరికా, కెనడా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్‌లకు చెందిన ప్రతినిధులు కూడా ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో పాల్గొంటామని తెలిపారని మాథ్యూస్ చెప్పారు.