జాతీయ వార్తలు

నేతాజీ పేరిట జాతీయ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: ప్రతిఏటా నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరిట ఒక జాతీయ అవార్డును ఇవ్వనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. వైపరీత్యాలలో చేపట్టే రక్షణ చర్యలలో అత్యంత ప్రతిభావంతంగా పనిచేసిన పోలీసులకు ఈ అవార్డును ఇస్తామని ఆజాద్ హింద్ గవర్నమెంట్ 75వ వార్షిక కార్యక్రమంలో ఆయన జాతీయ పోలీస్ స్మారక మ్యూజియంను జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రకటించారు. ప్రతి ఏడాది నేతాజీ జయంతి అయిన జనవరి 23న ఈ అవార్డు గ్రహీతను ప్రకటిస్తామన్నారు. ప్రకృతి వైపరీత్యాలలో జాతీయ, రాష్ట్ర విపత్తుల రక్షణ సంస్థ సభ్యుల సేవలను జాతి మరువదని ఆయన అన్నారు. ఈ ఎన్‌డిఆర్‌ఎప్, ఎస్‌డిఆర్‌ఫ్ టీమ్ సభ్యులు సాహసవంతులైన పోలీసులని అభివర్ణించారు. జాతికి వారు అందిస్తున్న సేవలు, త్యాగాలను దేశం మ రువదని అన్నారు. రైలు ప్రమాదాలు జరిగినప్పుడు, వరదలు వంటివి వచ్చినప్పుడు, భవనాలు కూలినప్పుడు తమను రక్షిస్తున్న వీరి గురించి చాలామందికి కనీసం తెలియదని ప్రధాని ఉద్వేగంగా అన్నారు.