జాతీయ వార్తలు

రైల్వే ట్రాక్‌పై బైఠాయించి నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమృత్‌సర్, అక్టోబర్ 21: దసరా వేడుకల్లో పాల్గొన్నవారిని రైలు ఢీకొని 59 మందిని పొట్టన పెట్టుకున్న విషాద ఘటనపై ప్రజల ఆగ్రహావేశాలు ఇంకా చల్లారలేదు. ఈ విషాద ఘటన జరిగిన చోటనే రైల్వే ట్రాక్‌లపై స్థానిక ప్రజలు ఆదివారం బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. తమను అక్కడి నుంచి ఖాళీ చేయించడానికి ప్రయత్నించిన భద్రతా బలగాలతో తగాదా పడ్డారు. వారిపైకి రాళ్లు రువ్వారు. ఆందోళనకారులు రువ్విన రాళ్లు తగిలి ఒక పోలీస్ కమాండో, ఒక ఫొటోజర్నలిస్టు గాయపడ్డారని అధికారులు తెలిపారు. చివరకు మధాహ్నం వేళ భద్రతా బలగాలు రైల్వే ట్రాక్‌లపై బైఠాయించిన ఆందోళనకారులను తొలగించి, ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించాయి. శుక్రవారం సాయంత్రం సంభవించిన భయంకరమయిన ప్రమాదం తరువాత 40 గంటలకు ఆదివారం మధ్యాహ్నం ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించినట్లు రైల్వే అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. శుక్రవారం సాయంత్రం రైల్వే ట్రాక్ పక్కన దసరా వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న రావణ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాన్ని రైల్వే ట్రాక్‌లపై నిలబడి చూస్తున్న ప్రజలను రైలు ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 59 మంది మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు. ఇదిలా ఉండగా, ఆదివారం మధ్యాహ్నం 14.16 గంటలకు మనవల నుంచి అమృత్‌సర్‌కు తొలి గూడ్స్ రైలును ఈ మార్గం మీదుగా పంపించినట్లు ఉత్తర రైల్వే అధికార ప్రతినిధి దీపక్ కుమార్ ఒక వార్తాసంస్థకు చెప్పారు. దాని తరువాత మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లను పంపించినట్టు ఆయన వివరించారు. ప్రమాదం జరిగిన మార్గంలో రైలు సర్వీసులను పునరుద్ధరించడానికి స్థానిక అధికారుల నుంచి రైల్వేలకు ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు క్లియరెన్స్ లభించిందని దీపక్ కుమార్ తెలిపారు. ‘శుక్రవారం ప్రమాదం జరిగిన జోడా ఫటక్ సమీపంలోని రైల్వే ట్రాక్‌ల మీదుగా ఆదివారం మధ్యాహ్నం రైలు సర్వీసుల రాకపోకలను పునరుద్ధరించినట్లు ఫిరోజ్‌పూర్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటి కమిషనర్ సుధాకర్ తెలిపారు.
చిత్రం..రైలు ఢీకొని మృతి చెందిన వారి బంధువులు రైల్వే ట్రాక్‌పై నుంచి కర్రలు, రాళ్లతో
పోలీసులపై దాడులు చేస్తున్న దృశ్యం