జాతీయ వార్తలు

కూర్పుపై కాంగ్రెస్ కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ అసెంబ్లీ రిజర్వ్‌డ్ స్థానాల అభ్యర్థుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరుకుంది. అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీ ఢిల్లీలోని వార్‌రూమ్‌లో దళిత, గిరిజన నాయకులతో విడివిడిగా సమావేశమైంది. కాంగ్రెస్ సీనియర్ నేత భక్త చరణ్‌దాస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నేతలతో సమాలోచనలు జరిపింది. దామోదర రాజనర్సింహా, మల్లు భట్టి విక్రమార్క, గీతారెడ్డి, సర్వే సత్యనారాయణతో సహా పలువురు నాయకులు ఈ సమావేశంలో పాల్కొన్నారు. సమావేశానంతరం కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ దామోదర రాజనర్సింహా మాట్లాడుతూ రాష్ట్రంలోని 19 ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాలకు అభ్యర్థుల గురించి, బలమైన నాయకుల అవకాశాలపై చర్చించినట్టు చెప్పారు. ప్రస్తుతం టిక్కెట్లు ఆశిస్తున్న ఎస్సీ అభ్యర్థులపై తమ వద్ద నుంచి స్క్రీనింగ్ కమిటీ అభిప్రాయాలు తెలుసుకుందని వెల్లడించారు. తొలిసారి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల ఎంపికపై ఆ సామాజిక వర్గాల వారితో విడివిడిగా సమావేశాలు నిర్వహించడం జరిగిందన్నారు. పార్టీలో సమర్థులైన ఎస్సీ అభ్యర్థులను రిజర్వ్‌డ్ స్థానాలకే కాకుండా జనరల్ స్థానాల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించే అంశంపై కూడా చర్చకు వచ్చిందని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా ఎస్సీ, ఎస్టీలకు ప్రయోజనం చేకూరే అంశాలను పొందుపరుస్తామని దామోదర్ వెల్లడించారు. అనంతరం తెలంగాణ కాంగ్రెస్ గిరిజన నాయకులతో స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి బలరాం నాయక్, సీతక్క, రవీంద్రనాయక్, రేగ కాంతారావు తదితరులు హాజరయ్యారు. అనంతరం మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ విలేఖరులతో మాట్లాడుతూ ఎస్టీ నియోజకవర్గ అభ్యర్థుల ప్రతిపాదనలపై అభిప్రాయలను కమిటీ తెలుసుకుందని అన్నారు. అన్ని నియోజక వర్గాలలోనూ ఆదివాసీలు, లంబాడీలు కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాల్సిన అంశంపై చర్చించినట్టు వెల్లడించారు. గిరిజనులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తామని బలరాం నాయక్ స్పష్టం చేశారు. అలాగే 10 శాతం రిజర్వేషన్లు, ఇంటికో ఉద్యోగం అంటూ ఎస్టీలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు చేయలేకపోయారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసుందనే నమ్మకం ప్రజలలో ఉందన్నారు.