జాతీయ వార్తలు

రాఫెల్ ఒప్పందమే మోదీని ముంచుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, అక్టోబర్ 22: వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిన రాఫెల్ ఒప్పందమే మోదీ ప్రభుత్వాన్ని ముంచుతుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. ఇక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రభ రానురాను మసకబారుతోందని, ఆయన ప్రసంగాలు చూస్తేనే ఈ విషయం మనకు అర్థమవుతుందని, మోదీ ప్రభుత్వం గురించి వాస్తవాలు ప్రజలకు పూర్తిగా తెలుస్తున్నాయని, ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రచారం కూడా చేయనవసరం లేదని ఆయన అన్నారు. రాఫెల్ ఒప్పందంలో అతిముఖ్యమైన రాఫెల్ జెట్‌ల తయారీ టెండర్‌ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)కు రాకుండా మోదీ ప్రభుత్వం లాక్కుందని, ఇది హెచ్‌ఏఎల్ ఉద్యోగులకు ఘోర అవమానమని అన్నారు. మనం హెచ్‌ఏఎల్ కార్యాలయానికి కనుక వెళ్తే రాఫెల్‌లో తమకు జరిగిన అన్యాయంపై ఆ కంపెనీ ఉద్యోగులు కన్నీటి పర్యంతమవుతున్నారని, మాజీ ఉద్యోగులు సైతం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇది తమకు తీరని అవమానంగా భావిస్తున్నామని పేర్కొంటున్నారన్నారు. దేశంలో అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నాయని, ద్రవ్యోల్బణం పెరిగిందని, రూపాయి విలువ క్షీణించిందని, చేసిన వాగ్దానాలు ఏమీ అమలు కాలేదని ఆయన విమర్శించారు. మోదీ ప్రసంగాల్లో పేర్కొన్న అంశాలకు, వాస్తవంగా జరుగుతున్న దానికి పొంతనే ఉండటం లేదని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తాము ఎన్నికల్లో ప్రచారం చేయాల్సిన అవసరం కూడా లేదని, మోదీ వైఫల్యాలే తమ గెలుపునకు సోపానాలని గెహ్లాట్ వ్యాఖ్యానించారు. ఒక కుటుంబం కోసం సర్దార్‌పటేల్, సుభాష్ చంద్రబోస్ ల్లాంటి మహనీయుల త్యాగాలను కాంగ్రెస్ మరుగున పరిచిందని మోదీ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. బోస్‌లాంటి వారిని జాతి నిరంతరం గుర్తుంచుకుంటుందని, వారి త్యాగాలను మరువదని పేర్కొంటూ, అయినా బీజేపీకి వారు చేసిన పోరాటాలు, త్యాగాలు ఇనే్నళ్లకు గుర్తుకువచ్చాయా? అని గెహ్లాట్ ధ్వజమెత్తారు.

చిత్రం.. జైపూర్‌లో సోమవారం మీడియాతో మాట్లాడుతున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అశోక్ గెహ్లాట్