జాతీయ వార్తలు

బంకు యజమానులను భయపెడుతున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: పెట్రో ఉత్పత్తులపై వ్యాట్‌ను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఢిల్లీలోని పెట్రోలు, సీఎన్‌జీ డీలర్లు బంద్ పాటించారు. దీనిపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, పెట్రోలు బంక్ యాజమాన్యాలపై కేంద్రం ఐటీ దాడులు చేయిస్తోందని, దీనికి భయపడే బంద్ పాటిస్తున్నారని వెల్లడించారు. అయిల్ కంపెనీలు కూడా పెట్రోల్ బంక్ యాజమానులపై కఠిన చర్యలు అవలంబిస్తున్నాయని ట్విట్టర్‌లో ఆరోపించారు. దేశంలో అన్ని మెట్రో నగరాలతో పోలిస్తే ఢిల్లీలో పెట్రోలు ధరలు తక్కువగానే ఉన్నాయని, బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ముంబయిలో పెట్రో ధరలు అత్యధికంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఢిల్లీలో పెట్రోల్ డీలర్ల అసోసియేషన్ పిలుపు మేరకు సోమవారం దాదాపు 400 బంకులు మూతబడ్డాయి. ఢిల్లీ ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్ టాక్స్‌ను తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇలావుండగా పెట్రోలు, డీజిల్‌ను కూడా జీఎస్‌టీ పన్ను పరిధిలోకి తీసుకురావాలని కేజ్రీవాల్ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం ప్రభుత్వం విధిస్తున్న పన్నుల మూలంగానే పెట్రోలు ధరలు ఇంత ఎక్కువగా ఉన్నాయని కేజ్రీవాల్ అన్నారు. ఈ ధరలు తగ్గాలంటూ ముందుగా కేంద్రమే స్పందించాలని వెల్లడించారు.

చిత్రం.. వ్యాట్‌ను తగ్గించాలని కోరుతూ సోమవారం దేశ రాజధాని న్యూఢిల్లీలో
బంక్‌లు మూసివేయడంతో పెట్రోల్ కోసం వాహనదారుల ఎదురుచూపులు