జాతీయ వార్తలు

సీమలో హైకోర్టు ఏర్పాటుకు రాష్టమ్రే అడ్డంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుపై తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి డిమాండ్ చేశారు. విష్ణువర్థన్ రెడ్డి సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటోందని ఆరోపించారు. కడప ఉక్కు పరిశ్రమ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు మేలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు చేస్తోందని, దానికోసం చైనాతో రహస్య మంతనాలు సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం ప్రభుత్వం తీరు ములంగా తెలంగాణలో వచ్చిన విధంగానే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం వచ్చే విధంగా ఉందని వ్యాఖ్యానించారు. రాయలసీమ ద్రోహులుగా తెలుగుదేశం నాయకులు వ్యవహరిస్తున్నారని, ఏపీ ప్రభుత్వం రాయలసీమ పట్ల అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా బీజేపీ పోరాడుతుందని విష్ణువర్థన్ రెడ్డి స్పష్టం చేశారు.