జాతీయ వార్తలు

ఉగ్రవాద కార్యకలాపాలను ఆపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ: పాకిస్తాన్ ఇకనైనా కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను నిలిపివేయాలని భారత్ గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఆదివారం పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి చొరబడటానికి ఉగ్రవాదులు ప్రయత్నించిన నేపథ్యంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు పాక్ ఉగ్రవాదులతో పాటు ముగ్గురు భారత్ జవాన్లు సైతం మృతి చెందిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కాల్పుల్లో మృతి చెందిన ఇద్దరు పాక్ ఉగ్రవాదుల మృతదేహాలను వెంటనే తీసుకుని వెళ్లాలని ఆర్మీ అధికారి ఒకరు పాక్‌ను కోరారు. పాక్ తనగడ్డ నుంచి ఉగ్రవాద కార్యకలాపాలకు స్వస్తి పలకాలని ఆయన హెచ్చరించారు. రాజోరి జిల్లాలోని సుందర్‌బని సెక్టార్‌లో ఎల్‌ఓసి వద్ద పాక్ నుంచి భారత్‌లోకి ఐదారుగురు ఉగ్రవాదులు ఆయుధాలతో చొరబడటానికి ప్రయత్నించారు. ఈ కాల్పుల్లో సైనికుడి దుస్తులు ధరించిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిని గుర్తించకపోయినా పాకిస్తాన్ బోర్డర్ ఏక్షన్ టీమ్ సభ్యులుగా భావిస్తున్నారు. అలాగే ఈ కాల్పుల్లో భారత్‌కు చెందిన హవల్దార్ కౌశల్‌కుమార్, రంజిత్ సింగ్, రజత్‌కుమార్ మృతి చెందగా, రాకేష్‌కుమార్ అనే సైనికుడు గాయపడ్డాడు. కాగా, మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ స్థాయిలో ఈ ఏడాది మే 29న పాకిస్తాన్‌తో భారత్ ఆర్మీ శాంతి చర్చలు జరిపింది.
చర్యల తర్వాత ఆధీన రేఖ వద్ద భారత్ సైనికులు పాక్ కవ్వింపులకు లొంగకుండా పూర్తి సంయమనం పాటించారు. అయినా పాకిస్తాన్ మాత్రం తన బుద్ధి మార్చుకోలేదు. ఎల్‌ఓసీ ద్వారా ఉగ్రవాదులను భారత్‌లోకి పంపడం మానలేదు. మే 30 తర్వాత ఏడుసార్లు పాక్ ఉగ్రవాదుల చొరబాటును భారత్ అడ్డుకోవడం, 23 మంది ఉగ్రవాదులు హతమవ్వడం దీనికి నిదర్శనమని ఆర్మీ అధికారి తెలిపారు. ఉగ్రవాదులు భారత్‌లో చొరబడకండా భారత్ సైన్యం నిత్యం అప్రమత్తతతో ఉందని, పాక్ ఆగడాలను సహించేది లేదని ఆయన హెచ్చరించారు.