జాతీయ వార్తలు

శరణార్థులు వేరు, అక్రమ వలసదారులు వేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 23: శరణార్థులు, అక్రమ వలసదారుల మధ్య తేడా ఉందని, ఈ విషయాన్ని గుర్తించాలని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. అస్సాంలో జాతీయ పౌరరిజిస్టర్ పౌరసత్వం (సవరణ) బిల్లు అంశంపై మాట్లాడుతూ పై విధంగా అన్నారు. కొన్ని నెలల క్రితమే జాతీయ పౌరరిజిస్టర్ ముసాయిదాను ప్రచురించినట్లు చెప్పారు. రిజిస్టర్‌లో 40 లక్షల మంది పేర్లు లేవని, వీరు సంబంధించిన డాక్యుమెంట్లను చూపెట్టి మళ్లీ పేరును చేర్చుకోవచ్చన్నారు. పౌరసత్వం సవరణ బిల్లు 2016ను లోక్‌సభలో గతంలో ప్రవేశపెట్టామన్నారు. 1955లోని పౌరసత్వ చట్టానికి సవరణలు ప్రతిపాదించినట్లు ఆమె చెప్పారవ. హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులు బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్‌లో తీవ్రమైన ఇక్కట్లను ఎదుర్కొంటున్నారన్నారు. వీరంతా 2014 డిసెంబర్ 31 కంటే ముందు భారత్‌లోకివచ్చారన్నారు. కాగా పౌర సత్వ బిల్లుపై అస్సాంలో 46 గ్రూపులు ఉమ్మడిగా 48 గంటల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ శరణార్థులు, అక్రమ వలసదారులకు మధ్య ఉన్న తేడాను గమనించాలన్నారు. మంగళవారం ఇక్కడ ఆమె బ్రిటీష్ హై కమిషన్, అబ్జర్వర్ రీసెర్చి ఫౌండేషన్ నిర్వహించిన యంగ్ థింకర్స్ సదస్సులో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అక్రమంగా దేశంలోకి వలసలు వచ్చి స్థిరపడిన వారు అస్సాంలో జాతీయ పౌరరిజిస్టర్‌లో పేరు నమోదుకు నానా తంటాలు పడుతున్నారన్నారు. వారు అనేక స్కీంల వల్ల లబ్ధి పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ సుంపన్నంగా ఉందని చెప్పడానికి ఆ దేశంలో ఆరోగ్య రంగంలో లభించే సదుపాయాలని చెప్పారు. ఇప్పటికీ పేదల ఇంట్లో ఒకరికి రోగం వస్తే మరింత దుర్భర దారిద్య్రంలో కూరుకుపోతున్నారని ఆమె అన్నారు. అందుకే కేంద్రం పేదల ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని 1300 రోగాల నివారణకు ఆరోగ్య బీమా స్కీంను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఇదేమీ పాపులర్ స్కీం కాదని, ప్రజల ఆరోగ్య, ఆర్థిక జీవన విధానాలను మెరుగుపరిచేందుకు కేంద్రం చేస్తున్న ప్రయోగమని ఆమె చెప్పారు.