జాతీయ వార్తలు

ఇక క్యూలకు దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: రైల్వే ప్రయాణీకులకు శుభవార్త. రైళ్లలో సాధారణ టిక్కెట్ల కొనుగోలుకు చాంతాడంత క్యూల్లో గంటల తరబడి నిలబడాల్సిన పనిలేదు. యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా అన్‌రిజర్వుడ్ టిక్కెట్లను ఆన్‌లైన్ ద్వారా కొనుగొలు చేయవచ్చు. ఈ విధానాన్ని నవంబర్ 1వ తేదీ నుంచి రైల్వే శాఖ దేశ వ్యాప్తంగా ప్రవేశపెట్టనుంది. ఈ స్కీం కొత్తదేమీ కాదు. నాలుగేళ్ల క్రితం ముంబయిలో ప్రవేశపెట్టారు. కాని ఈ స్కీంకు సరైన ప్రచారం లేదు. ముంబయి తర్వాత ఢిల్లీ-పాల్వాయి, చెన్నై నగరంలో ఈ స్కీంను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని రైల్వేజోన్లలో అమలు చేస్తున్నారు. యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా ఇకపై విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. అన్ని వర్గాల ప్రయాణీకులు ఈ యాప్‌ను వినియోగించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రైల్వే శాఖ పేర్కొంది. ఇప్పటికే 45 లక్షల మంది ప్రయాణీకులు రిజిస్టర్ చేయించుకున్నారు. రోజుకు 87వేల మంది ఈ యాప్‌ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేస్తున్నారు. రైల్వే స్టేషన్ నుంచి 25-30 మీటర్ల దూరంలో ఉండగా ఈ యాప్ పనిచేస్తుంది. ఒకసారి నాలుగు టిక్కెట్లను నమోదు చేయవచ్చును. ప్లాట్‌ఫారమ్, నెలవారీ టిక్కెట్లను ఈ యాప్ ద్వారా కొనుగోలు చేయవచ్చును. ఈ యాప్ ద్వారా రైల్వే శాఖకు సగటున రోజుకు రూ.45 లక్షల ఆదాయం వస్తుంది.