జాతీయ వార్తలు

షార్ నుంచి వచ్చేనెలలో మరో రెండు ప్రయోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, అక్టోబర్ 26: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో రెండు రాకెట్ ప్రయోగాలకు సన్నాహం చేస్తోంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) కేంద్రం నుంచి నవంబర్‌లో ఏకంగా రెండు రాకెట్ ప్రయోగాలను చేపట్టేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇందులో ఒక పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ రాకెట్లను ప్రయోగించనున్నారు. మొదటి ప్రయోగ వేదిక నుంచి చేపట్టే పీఎస్‌ఎల్‌వీ వాహక నౌక ద్వారా మన దేశానికి చెందిన ఉపగ్రహంతో పాటు విదేశాలకు చెందిన మరో 30 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇందులో మనదేశానికి చెందిన హైసిస్ ఉపగ్రహాన్ని శుక్రవారం బెంగళూరులోని ఉపగ్రహ తయారీ కేంద్రం నుంచి రోడ్డు మార్గాన అత్యంత భారీ భద్రత నడుమ ప్రత్యేక వాహనంలో షార్‌కు తీసుకొచ్చారు. ఈ ప్రయోగాన్ని నవంబర్ 27న ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3-ఎఫ్ 11 రాకెట్ ద్వారా కమ్యూనికేషన్ రంగానికి చెందిన జీశాట్-7 ఏ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. ఈ ప్రయోగ ఏర్పాట్లు కూడా రెండో ప్రయోగ వేదిక వద్ద చురుగ్గా సాగుతున్నాయి. సెప్టెంబర్ 16న ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ-సీ 42 రాకెట్ ప్రయోగనంతరం ఇస్రో దాదాపు రెండు నెలల విరామం తరువాత నవంబర్‌లో ఒకే నెలలో రెండు ప్రయోగాలకు చేపట్టేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు.