జాతీయ వార్తలు

‘కృష్ణా’ కేటాయింపులను తేల్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: కృష్ణా నదీ జలాల కేటాయింపులపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వీలైనంత త్వరగా పూర్తయ్యేలా ఆదేశించాలని కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతిని సిఎం కెసిఆర్ కోరారు. ఢిల్లీ పర్యటనలోవున్న కెసిఆర్, సోమవారం పలువురు ఎంపీలతో వెళ్లి ఉమాభారతిని కలిశారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డును వీలైనంత త్వరగా ప్రకటించటం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల మధ్యవున్న జల సమస్యలను త్వరగా పరిష్కరించాలని కేంద్ర మంత్రిని కెసిఆర్ కోరారు. ఉమాభారతితో కెసిఆర్ చర్చలు సుహృద్భావ వాతావరణంలో సాగాయని తెరాస ఎంపీ బూర నరసయ్య గౌడ్ వెల్లడించారు. ఉమాభారతితో కెసిఆర్ సాగించిన చర్చల వివరాలను వెల్లడిస్తూ, జలవనరుల విషయంలో తెలంగాణ ఎదుర్కొంటున్న సమస్యలను సవివరంగా వివరించామన్నారు. బతకాలి, ఇతరులను బతకనివ్వాలన్నది తమ విధానమని, అందుకే మహారాష్టల్రాంటి పొరుగు రాష్ట్రాలతో కలిసి మెలిసి పని చేస్తున్నట్టు మంత్రికి కెసిఆర్ వివరించారన్నారు. ప్రధాన మంత్రి కృషి సిచాయి పథకం కింద కూడా తెలంగాణకు నిధులు కేటాయించాలని కోరామన్నారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చేంతవరకు కృష్ణా నదీ జలాల వినియోగ బోర్డు రూపొందించిన ముసాయిదాపై స్టేటస్‌కో కొనసాగించాలని కెసిఆర్ కోరారన్నారు. కెసిఆర్‌తో జరిపిన సమావేశంలో తెలంగాణ పథకాల పట్ల కేంద్ర మంత్రి ఉమాభారతి సానుకూలంగా స్పందించారన్నారు. తెలంగాణ చేపట్టిన వివిధ మిషన్లు ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారన్నారు. మిషన్ కాకతీయ పరిశీలనకు తెలంగాణలో పర్యటిస్తానని ఉమాభారతి చెప్పారన్నారు.

చిత్రం.. సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి ఉమాభారతికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న తెలంగాణ సిఎం కెసిఆర్, చిత్రంలో ఎంపి కవిత ఉన్నారు