జాతీయ వార్తలు

కర్నాటక మంత్రి జార్జి రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూలై 18:దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన డిఎస్‌పి ఆత్మహత్య కేసులో కర్నాటక మంత్రి కెజె జార్జి సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. డిఎస్‌పి ఎమ్‌కె గణపతి ఆత్మహత్యకు కారకులయ్యారంటూ తనపైనా, మరో ఇద్దరు అధికారులపైనా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని స్థానిక కోర్టు ఆదేశించడంతో మంత్రి జార్జి ఈ నిర్ణయం తీసుకున్నారు. కోర్టు నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని, నిర్దోషిగా బయట పడగలనన్న నమ్మకం తనకు నూటికి నూరుశాతం ఉందని జార్జి తెలిపారు. ‘నాకు ఏమి జరిగినా అందుకు మంత్రి కెజె జార్జి, ఎఎమ్ ప్రసాద్ (ఐజి నిఘా), ప్రణబ్ మొహంతి (ఐజిపి లోకాయుక్త)లే బాధ్యులని ఓ స్థానిక టెలివిజన్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత డిఎస్‌పి గణపతి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం ఇటీవలే న్యాయ దర్యాప్తుకు ఆదేశించింది. ప్రస్తుతం ఈ కేసును సిఐడి దర్యాప్తు చేస్తోంది.