జాతీయ వార్తలు

గాలి నివాసంలో సీసీబీ సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బళ్లారి: మైనింగ్ డాన్ గాలి జనార్దన్‌రెడ్డిని కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా అంబిడెంట్ కంపెనీ కేసులో బళ్ళారి, బెంగళూరులోని గాలి ఇంట్లో సెంట్రల్ క్రైమ్ బ్యూరో (సీసీబీ) అధికారులు సోదాలు జరిపారు. బెంగళూరులోని గాలి నివాసం పారిజాతంలో బుధవారం సోదాలు నిర్వహించిన అధికారులు గురువారం బళ్ళారి నగరంలోని సిరుగుప్ప రోడ్డులో ఉన్న నివాసంలో సోదాలు జరిపారు. సీసీబీ అధికారి మంజునాథ్ చౌదరి నేతృత్వంలో ఎనిమిది మంది అధికారుల బృందం సోదాల్లో పాల్గొంది. ఆ సమయంలో ఇంట్లో గాలి మామ పరమేశ్వర్‌రెడ్డి మాత్రమే ఉన్నారు. అంబిడెంట్ కంపెనీ కేసుకు సంబంధించి చిక్కుబడిన డబ్బును విడిపించడానికి రూ.20 కోట్లకు డీల్ కుదుర్చుకున్న గాలి జనార్ధన్‌రెడ్డి అందులో రూ.2 కోట్లు నగదు తీసుకుని మిగతా రూ.18 కోట్లకు గాను 57 కిలోల బంగారాన్ని ఇచ్చేలా డీల్ కుదుర్చుకున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ బంగారాన్ని రమేశ్ కొఠారి ద్వారా బళ్ళారిలోని సువర్ణ జ్యువెలరీస్ నుంచి గాలి పీఏ అలీఖాన్‌రెడ్డికి ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి వాస్తవాలు తెలుసుకునేందుకు సీసీబీ అధికారులు సోదాలు జరిపినట్లు తెలుస్తోంది.