జాతీయ వార్తలు

మళ్లీ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తెలంగాణ శాసనసభకు పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటన మరోసారి వాయిదా పడింది. అభ్యర్థుల జాబితాను 12 లేదా 13న ప్రకటిస్తాం.. వెనుకబడిన కులాల వారికి 25 సీట్లు ఇస్తామని తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ అధ్యక్షుడు భక్తచరణ్‌దాస్ తెలిపారు. శనివారం ఆయన ఏపీ భవన్‌కు వచ్చి వెనుకబడిన కులాల వారికి ఎక్కువ సీట్లు కేటాయించాలనే డిమాండ్‌తో ధర్నా చేస్తున్న బీసీ నాయకులను బుజ్జగించిన అనంతరం విలేఖరులతో మాట్లాడారు. కొందరు నాయకులు టీఆర్‌ఎస్ ఇచ్చిన డబ్బుతో కాంగ్రెస్ టికెట్లు సంపాదించేందుకు ప్రయత్నిస్తున్న విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని భక్తచరణ్‌దాస్ చెప్పారు. ఇంతవరకు ఇరవై మంది బీసీల పేర్లు ఎంపిక చేశాం.. మరో ఐదుగురిని ఎంపిక చేసే పని సాగుతోందని అన్నారు. బీసీ అభ్యర్థుల ఎంపిక పూర్తికానంత వరకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటించటం జరగదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటన ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కార్యదర్శి కుంతియా రెండు రోజుల క్రితం కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసం వద్ద విలేఖరులతో మాట్లాడుతూ 10వ తేదీన 74 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ప్రకటిస్తామని చెప్పటం తెలిసిందే. అయితే టికెట్ల కోసం పార్టీలో అంతర్గతంగా పెరుగుతున్న ఒత్తిడితోపాటు మిత్రపక్షాలు అధిక సీట్లను డిమాండ్ చేయటంతో పార్టీ అభ్యర్థుల జాబితా శనివారం మరోసారి వాయిదా పడింది.
కాంగ్రెస్ అభ్యర్థుల మొదటి జాబితాను 12 లేదా 13న విడుదల చేస్తామని భక్తచరణ్‌దాస్ తెలిపారు. టికెట్లు కేటాయించేందుకు తాను డబ్బు వసూలు చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలను భక్తచరణ్‌దాస్ ఖండించారు. తనను అపఖ్యాతిపాలు చేసేందుకే కొందరు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. డబ్బు తీసుకుని టికెట్లు కేటాయించే సంస్కృతి కాంగ్రెస్‌లో లేదని ఆయన స్పష్టం చేశారు. టికెట్ల కోసం డబ్బు ఇచ్చామంటున్న వారి వద్దకు అంత డబ్బు ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. టికెట్లకోసం డబ్బు ఇచ్చామని చెబుతున్న వారిపై పీడీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని భక్తచరణ్‌దాస్ డిమాండ్ చేశారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారి అస్తిత్వం ఏమిటని ఆయన నిలదీశారు. సాక్ష్యాధారాలు లేకుండా ఆరోపణలు చేయటం మంచిది కాదని భక్తచరణ్‌దాస్ అన్నారు.
కమిటీలో చర్చిస్తాం
బీసీలకు ఎక్కువ టికెట్లు కేటాయించటం గురించి స్క్రీనింగ్ కమిటీ, కేంద్ర ఎన్నికల కమిటీలో చర్చిస్తామని భర్తచరణ్‌దాస్ ఏపీ భవన్ వద్ద ధర్నా చేస్తున్న బీసీ నాయకులకు హామీ ఇచ్చారు. టికెట్ల కేటాయింపులో బీసీలకు న్యాయం చేస్తాం.. బీసీలకు కనీసం 25 సీట్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. టికెట్లుకోసం బీసీ నాయకులు ధర్నా చేయటాన్ని ఆయన సమర్థించారు. బీసీ సీట్లను మిత్రపక్షాలకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. కాంగ్రెస్ నుండి కసీసం ఇరవై ఐదు మందిని పోటీ చేయిస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌లోకి ఇటీవలే వచ్చిన బయటివారికి టికెట్లు ఇస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని చెప్పగా, బయటినుండి వచ్చిన కొందరు టికెట్లు అడుగుతున్నారు.. వారి విషయం కమిటీ పరిశీలనలో ఉన్నదని భక్తచరణ్‌దాస్ తెలిపారు. ఈ అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. కొందరు నాయకులు టీఆర్‌ఎస్
ఇచ్చిన డబ్బుతో కాంగ్రెస్ టికెట్లు కొనుక్కున్నట్లు వార్తలు వస్తున్నాయని ఒక విలేఖరి ప్రశ్నించగా, ఈ ఆరోపణల్లోని నిజానిజాలు తెలుసుకునేందుకు ఆయా అభ్యర్థుల పూర్వాపరాలు తెలుసుకుంటున్నాం.. ప్రతి టికెట్‌ను పరిశీలించి ఇస్తామని భక్తచరణ్‌దాస్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి పదవి చేపట్టాలంటే బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని బీసీ నాయకులు డిమాండ్ చేశారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు టికెట్ ఇవ్వకుండా నానాఇబ్బంది పెడుతున్నారు.. ఏమిటిది అంటూ ధర్నా చేస్తున్న ఒక నాయకుడు భక్తచరణ్‌దాస్‌ను ప్రశ్నించారు. బీసీలకు న్యాయం చేయాలని అడగటం తప్పా అని వారు ప్రశ్నించారు.