జాతీయ వార్తలు

శబరిమల దర్శనం కోసం మహిళల ఆన్‌లైన్ బుకింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, నవంబర్ 10:శబరిమల ఆలయ దర్శనం కోసం 500 మంది మహిళలు ఈ-టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఈనెల 17 నుంచి మండల-మకరవిల్లక్కు పూజల కోసం అయ్యప్ప ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. దీంతో 10-50 ఏళ్ల మధ్యవయస్కులైన 500 మంది మహిళలు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. అన్ని వయసుల మహిళలకూ శబరిమల ఆలయ దర్శనం కల్పించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయల దర్శనానికి ప్రయత్నించిన పలువురు మహిళలను అయ్యప్ప భక్తులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. మండల పూజల నిమిత్తం అక్టోబర్ 30 నుంచి ఆన్‌లైన్ బుకింగ్ ప్రారంభమైంది. పోలీసు ఆన్‌లైట్ పోర్టల్ ద్వారా ఈ సదుపాయం కల్పించారు.‘పది నుంచి 50 ఏళ్ల వయసుగల మహిళలు 539 మంది ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్‌చేసుకున్నారు. మేం వాటిని లోతుకంటూ పరిశీలించలేదు. కాబట్టి పూర్తి వివరాలు వెల్లడించలేం’అని పోలీసులు శనివారం ఇక్కడ వెల్లడించారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.శబరిమలక్యూ.కామ్ నుంచి పేర్లు నమోదు చేసుకున్నట్టు సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు తెలిపారు.‘వెబ్‌సైట్ పరిశీలించగా మహిళల పేర్లు బయటపడ్డాయి. అయితే వాటిని స్వయంగా మహిళలే బుక్ చేసుకున్నారా? వెరొకరు చేశారా? అన్నదాన్ని నిర్ధారించలేం’అని ఆయన పేర్కొన్నారు. పోలీసు పోర్టల్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు ఎలాంటి రుసుం చెల్లించనక్కర్లేదు. అంతా ఉచితమే. ఈ- టిక్కెట్ల బుకింగ్ పేవ్‌మెంట్లు చెల్లించడానికి క్రెడిట్/డెబిట్ కార్డులు ఉపయోగిస్తే తప్ప పూర్తి వివరాలు తెలియవని ఆయన అన్నారు. పేరు రిజిస్టర్ చేసుకోడానికి కనీస రుసుం 10 రూపాయలు పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి రాసినట్టు అధికారి ఒకరు తెలిపారు. అయితే ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదని ఆయన చెప్పారు. అయితే కేఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో ఎలాంటి అడ్వాన్స్ బుకింగ్‌లు లేవని ఆయన స్పష్టం చేశారు. భక్తులు బస్సుల్లోనే రావాలన్న ఎవర్నీ బలవంతం పెట్టబోమని, కొందరు కాలినడకన పైకి వస్తుంటారని సీనియర్ అధికారి తెలిపారు. కాగా అయ్యప్పస్వామి ఆలయ పవిత్రత కాపాడాలంటూ ప్రత్యేక ప్రార్ధనలు చేపట్టనున్నట్టు అయ్యప్ప ధర్మరక్షక సమితి ప్రకటించింది.