జాతీయ వార్తలు

మిజోరం సీఈవో మార్పుపై ఈసీ దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 10: మిజోరం రాష్ట్ర ఎన్నికల అధికారి మార్పుపై కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టిసారించింది. సీఈవో ఎస్‌బీ శశాంక్‌ను తప్పించాలంటూ ఐఏఎస్‌లు, విద్యార్థులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న ఈసీ రంగంలోకి దిగింది. సీఈవో పదవికి సమర్ధుడైన అధికారి పేరును సూచించాల్సిందిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని కోరినట్టు ఈసీ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ సుదీప్ జైన్ నుంచి నివేదిక అందుకున్న తరువాత ఏం చేయాలన్నదానిపై ఆలోచిస్తామని ఆయన స్పష్టం చేశారు. బ్రూ ఓటర్ల గుర్తింపునకు సంబంధించి శశాంక్, సీనియర్ ఐఏఎస్ అధికారి ఛౌవొంగో మధ్య విభేదాలు తలెత్తాయి. చివరికి ప్రిన్సిపల్ కార్యదర్శి హోదా గల ఛౌవొంగోపై వేటు పడింది. వాస్తవానికి ఛౌవొంగో మిజోరం స్థానికుడు, గుజరాత్ కేడర్ ఐఏఎస్ అధికారి.