జాతీయ వార్తలు

ఢిల్లీ విమానాశ్రయంలో కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 10: ఢిల్లీ విమానాశ్రయంలో కందహార్‌కు వెళ్లే విమానంలో జరిగిన చిన్న పొరపాటు వల్ల కలకలం చెలరేగింది. ఈ విమానం ఢిల్లీ నుంచి కందహార్‌కు బయలుదేరాలి. ఆ సమయంలో పైలెట్ పొరపాటున హైజాక్ బటన్‌ను నొక్కారు. దీంతో భద్రతా సిబ్బంది రంగంలోకి దిగారు. రెండు గంటల సేపు విమానాన్ని నిలిపివేశారు. భద్రతాపరంగా మళ్లీ పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. హైజాక్ బటన్‌ను పొరపాటున నొక్కడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అధికార వర్గాలు తెలిపాయి. ఉగ్రవాద నిరోధక బలగాలు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ రంగంలోకి దిగాయి. ఈ విమానం చుట్టూ భద్రతా బలగాలు మొహరించి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. ఈ విమానం మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, చివరకు తనిఖీల తర్వాత 5.30 గంటలకు బయలుదేరింది.