జాతీయ వార్తలు

నక్సల్స్ రహిత రాష్ట్రంగా చత్తీస్‌గఢ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌పూర్, నవంబర్ 10: చత్తీస్‌గఢ్‌లో అధికార బీజేపీ శనివారం విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో పేద, మధ్య తరగతి వర్గాలపై వరాల జల్లు కురిపించింది. అన్నింటికంటే ముఖ్యంగా చత్తీస్‌గఢ్‌ను నక్సల్స్ రహిత రాష్ట్రంగా చేస్తామని బీజేపీ ప్రకటించింది. చిన్న, మధ్య తరగతి రైతులకు పెన్షన్ పథకాన్ని ప్రవేశపెడతామని ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది. ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ నాయకత్వంలోని బీజేపీ నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఉవ్విళ్లూరుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈనెల 12 నుంచి సంకల్పయాత్ర పేరుతో ఎన్నికల ప్రచారం చేయనున్నట్టు బీజేపీ నేతలు వెల్లడించారు. రాష్ట్రంలో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు నెలకొల్పుతామని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని రమణ్‌సింగ్ స్పష్టం చేశారు. రమణ్‌సింగ్ 15 ఏళ్ల పాలనలో చత్తీస్‌గఢ్ రూపురేఖలు మార్చేశారని, అభివృద్ధి ఎంతో పారదర్శకంగా సాగిందని పార్టీ చీఫ్ అమిత్‌షా తెలిపారు. బీజేపీ అధికారంలోకి రాకముందు చత్తీస్‌గఢ్ అత్యంత వెనుకబడిన రాష్టమ్రని ఆయన చెప్పారు. రాష్ట్భ్రావృద్ధికి రమణ్‌సింగ్ అంకితభావంతో పనిచేశారని అమిత్‌షా ప్రశంసలు కురిపించారు. మరోపక్క ప్రతిపక్ష కాంగ్రెస్‌పై బీజేపీ విరుచుకుపడింది. కాంగ్రెస్ పార్టీ రైతులను ఎప్పుడూ ఓటు బ్యాంకులానే చూసిందని, రైతుల దుస్థితికి ఆ పార్టీ విధానాలే కారణమని సీఎం సింగ్ ఆరోపించారు. 2004 నుంచి 14 వరకూ కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏనాడూ రైతుల బాగోగులు పట్టించుకోలేదని, స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలుపై దృష్టి సారించలేనని ఆయన విమర్శించారు. తమకు అధికారం ఇస్తే చిన్న, మధ్య తరగతి రైతులకు నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. 60 ఏళ్లు నిండిన భూమిలేని నిరుపేదలకు పెన్షన్ పథకం అమలుచేస్తామని అన్నారు. వచ్చే ఐదేళ్లలో వ్యవసాయ పంపుసెట్లకు రెండు లక్షల కొత్త కనెక్షన్లు ఇస్తామని బీజేపీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది. అటవీ ఉత్పత్తులకు ఒకటిన్నర రెట్లు అదనంగా గిట్టుబాటు ధర కల్పిస్తామని వెల్లడించారు. చత్తీస్‌గఢ్‌లో సేంద్రీయ వ్యయసాయానికి ప్రాధాన్యత ఇస్తామని మేనిఫోస్టోలో తెలిపారు. రాష్ట్రాన్ని నక్సల్స్ రహితంగా మార్చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. మహిళలు వ్యాపారాలు చేసుకునేందుకు వడ్డీలేకుండా రెండు లక్షల వరకూ రుణసదుపాయం కల్పించనున్నట్టు తెలిపారు. స్వయం ఉపాధి గ్రూపులకు 5 లక్షల రూపాయల రుణం ఇస్తామని బీజేపీ చెప్పింది. జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులను మల్టీస్పెషాలిటీలుగా అభివృద్ధి చేస్తామని, అంబికాపూర్, జగ్‌దల్‌పూర్‌లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నెలకొల్పుతామని ఎన్నికల ప్రణాళికలో స్పష్టం చేశారు. హిందీ, చత్తీస్‌గఢ్ ప్రాంతీయ భాష అభివృద్ధి కోసం కొత్త విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అలాగే పెన్షనర్లకు మెడికల్ అలవెన్స్ వెయ్యి రూపాయలు ఇస్తామన్నారు. చత్తీస్‌గఢ్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి, రాజధానికి చలనచిత్రాల షూటింగ్‌లకు అనువుగా అభివృద్ధి చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో వెల్లడించారు. బీజేపీ చీఫ్ అమిత్‌షా మాట్లాడుతూ రమణ్‌సింగ్ హయాంలో సిమ్మెంట్, ఉక్కు, విద్యుత్ ఉత్పత్తిలోనూ విద్యాపరంగానూ ఎంతో అభివృద్ధి సాధించిందని ప్రశంసించారు. ‘నవ్ చత్తీస్‌గఢ్’ లక్ష్యంగా సంకల్పయాత్ర ప్రారంభించనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో మావోయిస్టులను రూపుమాపినట్టు షా అన్నారు. కాంగ్రెస్ హామీల్లో కొత్తదనం లేదని ఆయన ఎద్దేవా చేశారు.
చిత్రం.. శనివారం రాయపుర్‌లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తున్న అమిత్‌షా, సీఎం రమణ్‌సింగ్