జాతీయ వార్తలు

మంచి పనులు చేతకానివాళ్లు నన్ను విమర్శిస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కొతా, నవంబర్ 10: కొన్ని పార్టీలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం, మంచి పనులు చేతకాదని, కాని విమర్శించడంలో ముందుంటాయని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. అధికారంలో ఉన్నా, ఒక్క మంచి పనిని కూడా చేయడం చేతకాని వారికి విమర్శించే హక్కు ఉండదని ఆమె బీజేపీని పరోక్షంగా విమర్శించారు. ఆమె శనివారం ఇక్కడ 24వ కోల్‌కొతా అంతర్జాతీయ చలన చిత్ర ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ చలనచిత్ర ఉత్సవం కొత్త ప్రమాణాలను నెలకొల్పిందన్నారు. ప్రజల భాగస్వామ్యం వల్ల ఈ ఉత్సవం విజయవంతమవుతోందన్నారు. తమ ప్రభుత్వం దుర్గాపూజ, క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుతామన్నారు. ప్రతి వేడుకను ఉత్సాహంగా ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తామన్నారు. నేతాజీ స్టేడియంకు 20 వేల మంది ప్రజలు ఈ చలనచిత్రోత్సవానికి రావడం సంతోషం కలిగిస్తోందన్నారు. ఇంతకు ముందు ప్రభుత్వాల హయాంలో ఈ ఉత్సవాలకు ఆదరణ ఉండేదికాదన్నారు. తమ ప్రభుత్వం ఈ ఉత్సవాల గౌరవాన్ని పెంచిందన్నారు. ఈ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, షారుక్ ఖాన్ పాల్గొనడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. వహీదా రెహమాన్, మహేష్ భట్, నందితాదాస్, ఇరాన్‌కు చెందిన దర్శకుడు మ జీద్ మజీదీ, ఆస్ట్రేలియాకు చెందిన చలనచిత్ర దర్శకులు పాల్గొన్నారు.