జాతీయ వార్తలు

తాయిలాల వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్: మధ్యప్రదేశ్‌లో తమ పార్టీ అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, ఉపాధి కల్పించేందుకు పరిశ్రమలకు ఐదేళ్ల పాటు వేతన గ్రాంటును మంజూరు చేస్తామని, గోసంరక్షణకు గోశాలలను నిర్మిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. శనివారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్‌నాథ్ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఈ నెల 28వ తేదీన మధ్యప్రదేశ్‌లోని 230 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. రైతులకు సామాజిక భద్రత కల్పించడంలో భాగంగా పెన్షన్లు మంజూరు చేస్తామని, భూమి డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లలో ఫీజు రాయితీలు ఇస్తామని హామీ ఇచ్చారు. చిన్న రైతుల కుమార్తెలకు వివాహం నిమిత్తం రూ.51వేల ఆర్థిక సాయం చేస్తారు. కమల్ నాథ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 112 పేజీల వచన పత్ ( ఎన్నికల మ్యానిఫెస్టో)కు కట్టుబడి ఉంటామన్నారు. రైతులకు స్వామి నాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామన్నారు. అన్ని వర్గాలతో మాట్లాడి మ్యానిఫెస్టోను ఖరారు చేశామన్నారు. 60 ఏళ్లు నిండిన రైతులకు నెలకు రూ.1000 పెన్షన్ ఇస్తామన్నారు. 2.5 ఎకరాలకు లోబడి ఉన్న రైతులకు పెన్షన్లు ఇస్తామన్నారు. వ్యవసాయానికి 50 శాతం సబ్సిడీపై రుణాలను పరికరాల కొనుగోలు, విద్యుత్ బిల్లులపై చెల్లిస్తామన్నారు. మంద్‌సోర్‌లో కాల్పుల ఘటనలో మరణించిన ఆరు గురు రైతుల సంఘటనపై మళ్లీ విచారణ జరిపిస్తామన్నారు. డీజిల్, పెట్రోలును రీబేట్‌పై చెల్లిస్తామన్నారు. తమ వృత్తులలో స్థిరపడేందుకు వీలుగా న్యాయవాదులు, టూరిస్టు గైడ్స్‌కు నెలకు రూ.4వేల చొప్పున ప్రోత్సాహక ఫీజును ఐదేళ్లపాటుచెల్లిస్తామన్నారు. యువతీయువకుల ఆరోగ్య సంరక్షణ నిమిత్తం యువ ఆయోగ్‌ను ఏర్పాటుచేస్తామన్నారు. రూ.100 కోట్ల వరకు పెట్టుబడులతో పరిశ్రమలు పెట్టేందుకు ప్రోత్సాహకాలను ప్రకటించారు. పరిశ్రమల్లో ఒక ఉద్యోగం కల్పిస్తే ఐదేళ్లపాటు పదివేల రూపాయలను చెల్లిస్తారు. పేద కుటుంబాలకు సిలిండర్ సరఫరాకు రూ.100 సబ్సిడీ చెల్లిస్తారు. పీజీ వరకు పేద బాలికలకు ఉచిత విద్యను అందిస్తారు. జనరల్ కేటగిరీ యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు జనరల్ కేటగిరీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కాంట్రాక్టు ఉద్యోగాలను 30 శాతం గిరిజనులకు రిజర్వు చేస్తామన్నారు. సీనియర్ సిటిజన్ బోర్డును, జర్నలిస్టులు, న్యాయవాదుల హక్కుల పరిరక్షణకు మండలిని ఏర్పాటుచస్తేరు. ఈ మ్యానిఫెస్టోలో 50 అంశాలను ప్రస్తావించారు. తాము బీజేపీ దుష్టపరిపాలనకు చరమగీతం పాడుతామని, ఇచ్చిన హామీలను నిర్ణీతకాలపరిమితిలోపల అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారు.
చిత్రం..శనివారం కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేస్తున్న
భోపాల్ కాంగ్రెస్ నేతలు కమల్‌నాథ్ సింథియా, దిగ్విజయ్‌సింగ్ తదితరులు