జాతీయ వార్తలు

ముస్లింలకు మొండిచెయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధ్యప్రదేశ్‌లో ముస్లింలు 8 నుంచి 9 శాతం వరకు ఉన్నారు. కాని ఈ వర్గానికి ప్రధాన రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించడం చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఈ రాష్ట్రంలో 230 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ముస్లింల జనాభా 7.8 మిలియన్లు ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు వీలుగా కాంగ్రెస్, బీజేపీలు తమకు ఎక్కువ సీట్లు కేటాయించాలని ముస్లింలు కోరుతున్నారు. కాని పట్టించుకునే నాయకులు లేరు. ప్రస్తుతం అసెంబ్లీలో ఒకే ఒక ముస్లిం ఎమ్మెల్యే ఉన్నారు. ఈ నెల 28వ తేదీన మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ ఒక ముస్లింకు సీటు కేటాయించింది. కాంగ్రెస్ అతి కష్టంపైన 3 సీట్లు కేటాయించింది. భోపాల్ నార్త్ అసెంబ్లీ సీటు నుంచి బీజేపీ ఫాతమీ సిద్ధిఖీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది. మాజీ మంత్రి రసూల్ అహ్మద్ సిద్ధిఖీ కుమార్తె ఫాతీమా. కాంగ్రెస్ పార్టీ భోపాల్ నార్త్ నుంచి అరిఫ్ అఖీల్, బూర్హాన్‌పూర్ నుంచి హమీద్ హాజీ, భోపాల్ సెంట్రల్ సీటు నుంచి అరిఫ్ మర్సూడ్‌కు సీటు కేటాయించింది. మైనార్టీలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, నిధుల కొరత లేకుండా చూస్తున్నామని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సాధారణ సమయాల్లో ఎన్నో గొప్పులు చెబుతాయి. కాని ఎన్నికలు వచ్చే సరికి గెలుపు గుర్రాలకే సీట్లు ఇస్తాయి. ఈ గెలుపు గుర్రాల్లో ముస్లింలు ఉండరు. వీరు రాజకీయంగా ఎదిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించడం లేదనే అపవాదు ఉంది. ఇదే విషయాన్ని మధ్యప్రదేశ్ ముస్లిం వికాస్ పరిషత్ అనే రాజకీయేతర సంస్థ కన్వీనర్ మహమ్మద్ మహీర్ అన్నారు. బీజేపీ సంగతి అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ మొక్కుబడిగా మూడు సీట్లు ఇచ్చింది. ఇందులో ఒక సిటింగ్ సీటు ఉంది. 1993లో కాంగ్రెస్ పార్టీ మూడు సీట్లను మైనార్టీలకు ఇచ్చింది. రాష్ట్రం మొత్తం మీద చూస్తే భోపాల్ నార్త్ సీటులో మాత్రమే ఒక ముస్లిం అభ్యర్థి గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి. 2013లో కాంగ్రెస్‌కు ఐదు సీట్లు ఇస్తే ఒక సీటు భోపాల్ నార్త్‌లో గెలిచింది. 2008 ఎన్నికల్లో కాంగ్రెస్ ఐదు సీట్లు ఇచ్చిన అదే భోపాల్ నార్త్‌లో కాంగ్రెస్ గెలిచింది. భోపాల్‌కు చెందిన న్యాయవాది సాజిద్ అలీ మాట్లాడుతూ చట్టసభల్లో ముస్లింలకు ప్రాతినిధ్యం లేదు. జాతీయ స్థాయిలో ముస్లింలకు నేతలు లేరు. ముస్లింలను రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే పరిగణిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి నలుగురు వర్కింగ్ అధ్యక్షులను ప్రకటించింది. ఇందులో ఒక్క ముస్లిం కూడా లేకపోవడం బాధ కలిగిందని సాజిద్ అలీ అన్నారు. కాంగ్రెస్‌లో మెతకవైఖరితో ఉంటే హిందుత్వ వాదులు ఉన్నారని, వీరు మైనార్టీల ఎదుగుదలను అడ్డుకుంటున్నారన్నారు. కాగా మైనార్టీల్లోకి బీజేపీ చొచ్చుకుపోయిందన్న మాట వాస్తవమేనని కాంగ్రెస్ నేత అరిఫ్ మసూద్ చెప్పారు. ఇందులో నిజం లేదని కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను సమానంగా చూస్తుందని అధికార ప్రతినిధి జేపీ ధానోపియా అన్నారు.