జాతీయ వార్తలు

మాది శాంతిపథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 11: ప్రపంచ శాంతికి భారత్ కట్టుబడి ఉందని నరమేథాన్ని సృష్టించే మానవాళిని సర్వనాశనం చేసే విధ్వంసాలకు దూరంగా శాంతియుత పథంలో ప్రపంచ గమనం సాగాలని ప్రధాని నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. మొదటి ప్రపంచయుద్ధంలో అశువులు బాసిన భారత జవాన్లకు ఘన నివాళి అర్పించిన ఆయన ‘అత్యంత భయానకమైన రీతిలో లక్షలాది మంది ప్రాణాలు తీసిన మొదటి ప్రపంచ యుద్ధం జరిగి వందేళ్లు పూర్తయ్యింది. అటువంటి పీడకల పునరావృతం కాకుండా శాంతికి ప్రపంచదేశాలు కట్టుబడాలి. సామరస్యం, సౌభ్రాతృత్వం పరిఢవిల్లేలా ప్రపంచదేశాలు కంకణబద్ధం కావాలి’ అని మోదీ స్పష్టం చేశారు. ప్రపంచ యుద్ధంతో భారత్‌కు నేరుగా సంబంధం లేకపోయినా ఎంతోమంది భారతీయులు మరణించారని, వారంతా ప్రపంచ శాంతికోసమే ప్రాణత్యాగం చేశారని మోదీ అన్నారు.