జాతీయ వార్తలు

ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధుర, నవంబర్ 11: ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టిన బీజేపీ రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ రామశంకర్ కథేరియా ధీమా వ్యక్తం చేశారు. నరేంద్రమోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపథకాలు, అందరూ మెచ్చే పనితీరును చూస్తే ఆయన పార్టీ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘన విజయం పొందడం ఖాయమని ఆయన అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ శంకరాచార్యఆశ్రమ్‌లో విలేఖరులతో మాట్లాడుతూ ఎలాంటి అజెండాలేని కూటమి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధిస్తుందనుకోవడం భ్రమేనని అన్నారు. మోదీయే మళ్లీ ప్రధాని అవుతారని, ఆయన ఆధ్వర్యంలో దేశం ఎంతో ప్రగతిని సాధించిందని, ప్రజలు ఆయనకే తిరిగి పట్టం కడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పేదల సంక్షేమానికి మోదీ చేపడుతున్న పథకాలను ఆయా వర్గాలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని అన్నారు. మోదీ చేపట్టిన అభివృద్ధి వల్ల పల్లెవాసులు సైతం విద్యుత్, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలతో పట్టణ ప్రజలు దీటుగా ధీమాగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం వల్ల పేదలు సైతం ఖరీదైన వైద్యాన్ని పొందగలుతున్నారన్నారు. నోట్ల రద్దును ఒక ఆర్థిక నేరంగా విపక్షనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించడాన్ని ఆయన ఖండించారు. తన హయాంలో ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్ బాధితుల కుటుంబాలకు నెలరోజుల్లో సహాయ అందజేస్తోందని ఆయన చెప్పారు. మూడు నెలల క్రితం మధురలో డ్రైనేజ్ శుభ్రం చేస్తుండగా మరణించిన కార్మికుని కుటుంబానికి పది లక్షల నష్టపరిహారం, వారి కుటుంబ సభ్యులకు ఇల్లు, ఉద్యోగం ఇచ్చిన సంగతిని ఆయన ఈ సందర్భంగా ఉదాహరించారు. దళితుల హత్య, అత్యాచారం జరిగిన వెంటనే దానికి సంబంధించిన నివేదికను సంబంధిత జిల్లా మెజిస్ట్రేట్, సూపరింటెండెంట్‌తో 24 గంటల్లో తెప్పించుకుని పరిశీలించి, మూడు రోజుల్లో బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నట్టు ఆయన చెప్పారు. అంతకుముందు కథేరియా శంకరాచార్య, అడహక్‌షాజనంద్ థియో మహారాజ్‌ను కలిసి అయోధ్యలో రామమందిర నిర్మాణం విషయమై చర్చించారు. తాను శంకరాచార్య జీ మహారాజ్ ఆశీర్వాదం పొంది రామమందిర నిర్మాణం గురించి చర్చించడానికి వచ్చినట్టు ఈ సందర్భంగా రామ్‌శంకర్ కథేరియా తెలిపారు.