జాతీయ వార్తలు

అనంత్‌కుమార్ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్ సోమవారం బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన కొన్ని నెలలుగా ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్నారు. 59 ఏళ్ల కుమార్ సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన చనిపోయే వరకూ భార్య తేజశ్వినీ, ఇద్దరు కుమార్తెలు పక్కనే ఉన్నారని శంకర ఆసుపత్రి వైద్యుడు నాగరాజా వెల్లడించారు. అమెరికా, బ్రిటన్‌లో చికిత్స చేయించుకుని ఇటీవలే ఆయన బెంగళూరుకు వచ్చి శంకర ఆసుపత్రిలో చేరారు. కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ పార్థీవదేహాన్ని ప్రజల సందర్శనార్థం నేషనల్ కాలేజీ గ్రౌండ్‌కు తరలించినట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. బెంగళూరు సౌత్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేన్సర్ వల్ల ఇన్‌ఫెక్షన్ సోకి ఆయన చనిపోయారని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. గత కొద్దిరోజులుగా ఆసుపత్రి ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. అనంత్‌కుమార్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంచి విలువలున్న స్నేహితుణ్ని కోల్పోయాని మోదీ ఓ సంతాప సందేశంలో పేర్కొన్నారు. యువకునిగా ఉన్నప్పటి నుంచి సమాజసేవకు అంకితమైన నేత అనంత్‌కుమార్ అని ఆయన శ్లాఘించారు. నియోజకవర్గం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవలందించేవారని మోదీ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దివంగత మంత్రి భార్య డాక్టర్ తేజశ్వినీని
ప్రధాని ఫోన్‌లో ఓదార్చారు. కాగా ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా రాజకీయాల్లో వచ్చిన కుమార్ ఆరుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. వివాదాలకు అతీతంగా ఉండేవారు. బీజేపీ అగ్రనేతలు వాజపేయి, అద్వానీ, ఇప్పటి ప్రధాని మోదీతో మంచి సంబంధాలు ఉన్నాయి. 1987లో బీజేపీలో చేరిన అనంత్‌కుమార్ రాజకీయంగా వెనక్కిచూడలేదు. యువమోర్చా నుంచి పార్టీలోని అనేక కీలక పదవులు చేపట్టారు. కర్నాటకలో బీజేపీ బలోపేతానికి పాటుపడ్డ నాయకుల్లో అనంత్‌కుమార్ ఒకరు. 2008లో బీజేపీ అధికారంలోకి రావడం వెనక యెడ్యూరప్పతో పాటు ఆయన కృషి ఉంది. బెంగళూరు సౌత్ నుంచి 1996లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. చనిపోయే వరకూ ఆయన అక్కడి నుంచే గెలుస్తూ వచ్చారు.

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్ (ఫైల్‌పొటో)