జాతీయ వార్తలు

మీ కితాబులేమీ వద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిలాస్‌పూర్, నవంబర్ 12: పెద్ద నోట్ల రద్దుపై తనను తూర్పారబడుతున్న కాంగ్రెస్ నేతలు సోనియా,రాహుల్‌పై ప్రధాని మోదీ తీవ్ర స్వరంతో విరుచుకు పడ్డారు. సోమవారం ఇక్కడ జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన మోదీ ‘ఆర్థిక అవకతవకలకు పాల్పడి ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న ఈ తల్లీ కొడుకుల నుంచి నా నిజాయితీకి ఎలాంటి ప్రశంసా పత్రం అవసరం లేదు’అని అన్నారు. చత్తీస్‌గఢ్ రెండోదశ ప్రచారంలో భాగంగా జరిగిన ఈ సభలో మాట్లాడిన మోదీ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ రాజకీయాలు గాంధీ కుటుంబంతో మొదలై ఆ కుటుంబంతోనే ముగుస్తాయి’అని అన్నారు. కాంగ్రెస్ పాలన కంటే కూడా బీజేపీ పాలనలోనే చత్తీస్‌గఢ్ ఎంతో వేగంగా అభివృద్ధి సాధించిందన్నారు. పెద్ద నోట్ల రద్దు ద్వారా తాను ఏమి సాధించానో
చెప్పాలని గాంధీలు తనను నిలదీస్తున్నారని అయితే ‘అసలే బెయిల్‌పై ఉన్న ఈ తల్లీ కొడుకులు నాకు నా నిజాయితి సర్ట్ఫికేట్ ఇస్తారా’అని మోదీ ఎదురుదాడికి దిగారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఎన్నో డొల్ల కంపెనీల బండారం బయట పడిందని, అదే నిర్ణయం కారణంగా ఈ తల్లీ కొడుకులు బెయిల్ తీసుకోవాల్సి వచ్చిందన్న విషయాన్ని మర్చిపోకూడదని సోనియా, రాహుల్‌లపై మోదీ విమర్శలు గుప్పించారు. నేషనల్ హెరాల్డ్ ఆర్ధిక అవకతవకల కేసులో సోనియా, రాహుల్ గాంధీకి ఢిల్లీ కోర్టు బెయిల్ ఇచ్చిన విషయాన్ని మోదీ ఈ సందర్భంగా పరోక్షంగా ప్రస్తావించారు. కాంగ్రెస్ పాలన అంతా అవినీతిమయమని పేర్కొన్న మోదీ ‘సంక్షేమ నిధుల్లో కేవలం 15పైసలు మాత్రమే లక్ష్యిత వర్గాలకు చేరుకున్నాయి’అంటూ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అన్న మాటల్ని ప్రస్తావించారు. మరి మిగిలిన 85పైసలను ఏ చెయ్యి తరలించిందో..’నని వ్యంగ్యోక్తి విసిరారు. అవినీతి కారణంగా అదృశ్యమైన ఆ 85పైసలను పెద్ద నోట్ల రద్దు ద్వారా తాము వెలికి తీశామని అన్నారు. దేశ సంక్షేమమే పరమావధిగా కాంగ్రెస్ నాయకత్వం ఎప్పుడూ పనిచేయలేదన్నారు. కాంగ్రెస్ పాలనలోనే కొనసాగి ఉంటే ప్రస్తుత స్థాయి అభివృద్ధి సాధించడానికి చత్తీస్‌గఢ్‌కు మరో 50ఏళ్లు పట్టేదన్నారు. కాంగ్రెస్ రాజకీయాలకు గాంధీ కుటుంబమే కేంద్రకమని, కానీ బీజేపీకి పేదల గుడిసెలే కీలకమని చెప్పారు. అభివృద్ధికి నిధులెక్కడి నుంచి వస్తాయని ప్రజలు తనను అడుగున్నారని చెప్పిన మోదీ ‘ఇనే్నళ్లుగా ఇనప్పెట్టెల్లోనూ, అటకల్లోనూ, పరుపుల కింద దాగిన ఈ అక్రమ సొత్తును పెద్ద నోట్ల రద్దు బయట పెట్టింది. ఈ సొమ్మంతా మీదే..’నని మోదీ అన్నారు. అభివృద్ధే పరమావధిగా తమ పార్టీ పని చేస్తోందని, కాంగ్రెస్‌కు నినాదాలు తప్ప ఎలాంటి విధానం లేదని మోదీ అన్నారు. కాగా, సోనియా రాహుల్‌లు బెయిల్‌పై ఉన్నారంటూ మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ అజాద్ తప్పుబట్టారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి తన పదవి గౌరవాన్ని దిగజార్చవద్దని మోదీకి హితవు పలికారు.

చిత్రం..వారణాసిలో సోమవారం హైవేలు, ఇన్‌లాండ్ ప్రాజెక్టులను ప్రారంభిస్తున్న
ప్రధాని నరేంద్ర మోదీ. వేదికపై యోగి ఆదిత్యనాథ్, రాజ్‌నాథ్, గడ్కరీ