జాతీయ వార్తలు

65 మందితో కాంగ్రెస్ తొలి జాబితా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను సోమవారం అర్థరాత్రి ప్రకటించారు. కాంగ్రెస్ అధినాయకత్వం పలు దఫాలు జరిపిన చర్చలు తరువాత 65 మంది పేర్లతో జాబితాను ఖరారు చేసింది. మంగళవారం నాడు జాబితా విడుదల చేస్తారని తొలుత వార్తలొచ్చిన సోమవారం పొద్దుపోయాక 65 మందితోకూడిన తొలి జాబితాను ప్రకటించారు. మిగతా నియోజకవర్గాలకు సంబంధించి జాబితాలను దశలవారీగా ప్రకటిస్తారు. భక్తచరణ్ దాస్ నాయకత్వంలోని రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ రెండేసి సార్లు సమావేశమైంది. విడతల వారీగా దాదాపు నాలుగు గంటల పాటు తర్జన భర్జన తరువాత అభ్యర్థుల జాబితాను ఖరారు చేశారు. కాగా శాసన సభకు పోటీ చేసే 70 మంది అభ్యర్థుల కాంగ్రెస్ మొదటి జాబితాను మంగళవారం విడుదల చేస్తామని కుంతియా తొలుత చెప్పారు. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశానంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఇలావుంటే, రాహుల్ గాంధీ ఆదేశం మేరకు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ నాలుగు రోజుల క్రితం ఆమోదించిన 74 మంది అభ్యర్థుల జాబితా నుండి దాదాపు పదిహేను మందిని తొలగించి కొత్త వారికి స్థానం కల్పించినట్లు తెలిసింది. సోనియా గాంధీ అధ్యక్షతన సోమవారం సాయంత్రం జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తొలి జాబితాకు ఆమోద ముద్ర వేశారు. మిగతావారిని త్వరలోనే ఎంపిక చేస్తారు. భక్తచరణ్‌దాస్ నాయకత్వంలోని స్క్రీనింగ్ కమిటీ మొదట తయారు చేసి, కాంగ్రెస్ ఎన్నికల కమిటీ గత వారం ఆమోదించిన 74 మంది జాబితాపై రాహుల్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం భక్తచరణ్ దాస్, కుంతియా,
ఉత్తమ్, శర్మిష్ట ముఖర్జీ, జ్యోతిరాణి, శ్రీనివాస్ తదితర నాయకులతో సమావేశమై గత వారం ఆమోదించిన 74 మంది అభ్యర్థుల జాబితాను మరోసారి సమీక్షించారు. బీసీలకు అన్యాయం చేశారు, బయట నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపణలు రావటంతో రాహుల్ సమీక్ష జరిపారు. రాహుల్ ఈ విషయంపై నిలదీసినట్టు తెలిసింది. కాగా ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో రెండు అసెంబ్లీ సీట్లను బీసీలకు కేటాయించాలన్న తన ఆదేశాన్ని ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది. బీసీలకు సముచిత న్యాయం చేయాలని, మూడు సార్లు ఓటమిపాలైన వారికి, ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి, గత ఎన్నికల్లో నలభై వేలు లేదా అంతకంటే ఎక్కువ ఓట్లతో ఓడిపోయిన వారికి టికెట్లు ఇవ్వకూడదని అధినేత ఆదేశించారు. ఆయన ఆదేశం మేరకు స్క్రీనింగ్ కమిటీ సభ్యులు మధ్యాహ్నం కాంగ్రెస్ వార్ రూంలో దాదాపు గంట సేపు సమావేశమై కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను వడపోశారు. రాహుల్ ఇచ్చిన సలహాల మేరకు తాజాగా జాబితాను తయారు చేసి ఆయనకు అందజేశారు. ఈ జాబితాను పరిశీలించిన అనంతరం సోనియా అధ్యక్షతన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశమై కొత్త జాబితాకు ఆమోదం తెలిపారు. సోనియా, రాహుల్ సోమవారం సాయంత్రం ఆమోదించిన 65 మంది అభ్యర్థుల జాబితానే అర్థరాత్రి విడుదల చేశారు.