జాతీయ వార్తలు

85 మంది సిట్టింగ్‌లకు చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, నవంబర్ 12: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యమంత్రి వసుంధర రాజే, స్పీకర్ కైలాష్ మేఘ్వాల్‌తో సహా 131 మందితో బీజేపీ తొలిజాబితా విడుదల చేసింది. వచ్చే నెల 7న రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్ అసెంబ్లీలో మొత్తం స్థానాలు 200. తొలి జాబితాలో పలువురు సీనియర్, సహాయ మంత్రులకు చోటు కల్పించారు. ఆదివారం పొద్దుపోయాక బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 85 మంది పేర్లు తొలి జాబితాలో ఉన్నాయి. కాగా 26 మంది సిట్టింగ్‌ల పేర్లు జాబితాలో కనిపించలేదు. ఈ జాబితాలో ఇద్దరు మంత్రులు, ఒక ముస్లిం ఎమ్మెల్యే పేర్లు లేవు. టిక్కెట్లు దక్కించుకున్న 85 మంది సిట్టింగ్‌లు పాత నియోజకవర్గాల్లోనే పోటీ చేస్తారు. ఎవరికీ నియోజకవర్గాల మార్పు చేయలేదు. మంత్రులు రాజేంద్ర రాథోడ్, గులాబ్ చంద్ కఠారియా, వాసుదేవ్ దేవ్‌మణి, శ్రీచంద్ కృపలానీ, కిరణ్ మహేశ్వరి అనితా భడేల్, అజయ్ సింగ్, కృష్ణేంద్ర కౌర్, గజేంద్ర సింగ్, ప్రభులాల్ సైనికి తొలిజాబితో చోటు దక్కింది. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు బీజేపీ టిక్కెట్లు ఇచ్చింది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే దేవీసింగ్ భట్ కోడలు పూనమ్ కన్వార్‌కు సీటు ఇచ్చారు. అలాగే జోధ్‌పూర్ ఎమ్మెల్యే కైలాష్ భన్సాలీ బంధువుఅతుల్ భన్సాలీకి టిక్కెట్ ఇచ్చారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నందలాల్‌మీనా కుమారుడు హేమంత్ మీనాకు తొలి జాబితాలో స్థానం దక్కింది. జాట్ వర్గానికి చెందిన మాజీ ఎంపీ సన్వార్‌లాల్ కుమారుడు రామ్‌స్వరూప్ జాట్‌కు బీజేపీ టిక్కెట్ ఇచ్చింది. మాజీ మంత్రి దిగంబర్‌సింగ్ కుమారుడు శైలేష్‌సింగ్‌కు టిక్కెట్ దక్కింది. దిగంబర్ గత ఏడాది మృతి చెందారు. అలాగే శంభూసింగ్ ఖేతాసర్(సర్దార్‌పూర్), సుమిత్ గోద్రా(లుంకారన్‌సార్), సతీష్ పూర్ణియా(అంబర్), జస్వంత్ గుర్జార్(బర్తీ), బాబులాల్ ఖరాడీ (జోదోల్), ఖేమ్‌రాజ్ గరాసియా (బగీదొర) ఉన్నారు. 2013 ఎన్నికల్లో వీరందరూ ఓటమి చెందారు. ఇక ఇద్దరు ముస్లిం సిట్టింగ్ ఎమ్మెల్యేలు హబీబుర్ రెహ్మాన్(నాగౌర్), రవాణా మంత్రి యూనస్ ఖాన్(దీద్‌వానా) ఉన్నారు. అయితే రెహ్మాన్‌కు ఈసారి టిక్కెట్ నిరాకరించారు. దీద్‌వానా నుంచి ఎవరి పేరునూ ప్రకటించలేదు. ఆ స్థానాన్ని పెండింగ్‌లో పెట్టారు. బీజేపీ తొలి జాబితాలో నీటి వనరుల మంత్రి సురేంద్ర గోయల్, గిరిజన శాఖ మంత్రి నందాలాల్ మీనా పేర్లు కనిపించలేదు. అయితే మీనా కుమారుడి అభ్యర్థిత్వాన్ని హైకమాండ్ ప్రకటించింది. అలాగే డిప్యూటీ స్పీకర్ రావు రాజేంద్రసింగ్, పార్టీ చీఫ్‌విప్ లాక్ గుర్జార్ పేర్లు తొలి జాబితాలో ఉన్నాయి. జైసాల్మెర్-బర్మేర్ ఎంపీ సోనారామ్‌కు బర్మేర్ అసెంబ్లీ టిక్కెట్ దక్కింది.