జాతీయ వార్తలు

మా మేనిఫెస్టోను వక్రీకరిస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, నవంబర్ 12: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధిస్తామని ఎక్కడా చెప్పలేదని, బీజేపీ ఓ పథకం ప్రకారం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని అంశాలను బీజేపీ నేతలు వక్రీకరిస్తున్నారని సోమవారం ఇక్కడ విరుచుకుపడ్డారు. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా, పార్టీ ఉపాధ్యక్షుడు ప్రభాత్ ఝా, మధ్యప్రదేశ్ పార్టీ చీఫ్ రాకేష్ సింగ్ ఆదివారం చేసిన వ్యాఖ్యలను కమల్‌నాథ్ ఖండించారు. ప్రజలను తప్పుదోవపట్టించేందుకు బీజేపీ నేతలు నానా తంటాలు పడుతున్నారని ఆయన ఆరోపించారు.‘అవసరం లేకపోయినా బీజేపీ నేతలు ఆర్‌ఎస్‌ఎస్ పేరును తెరమీదకు తెస్తున్నారు. రాముణ్ని, ఆర్‌ఎస్‌ఎస్‌ను మేం వ్యతిరేకిస్తున్నట్టు ప్రజలను నమ్మించాలని చూస్తున్నారు’అని పీసీసీ చీఫ్ నిప్పులు చెరిగారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మరుగుపరచేందుకు బీజేపీ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కమల్‌నాథ్ విమర్శించారు.‘ మా మేనిఫెస్టోలో ఎక్కడా ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధిస్తామని చెప్పలేదు. అలాగే కాంగ్రెస్ పార్టీకి అలాంటి ఉద్దేశమేలేదు. ఇదంతా బీజేపీ కట్టుకథ’ అని విలేఖరుల సమావేశంలో ధ్వజమెత్తారు. వ్యక్తిగతంగా కాంగ్రెస్‌పార్టీ గానీ ఎక్కడా ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధిస్తామని చెప్పలేదని కమల్‌నాథ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక శనివారం విడుదల చేసిన సంగతి తెలిసిందే.