జాతీయ వార్తలు

మిజోరం సీఎం చరాస్తులు రూ.కోటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐజ్వాల్, నవంబర్ 12: మిజోరం ముఖ్యమంత్రి లాల్ తన్హావాలా ఎన్నికల అఫిడవిట్‌లో కోటి రూపాయల చరాస్తులు ప్రకటించారు. అలాగే వ్యవసాయ భూములు, మిగతావి కలిపి మొత్తం రెండు కోట్ల రూపాయలు చూపించారు. ఈనెల 28న మిజోరం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. నామినేషన్ సందర్భంగా రిటర్నింగ్ అధికారికి అందజేసిన అఫిడవిట్‌లో 5 లక్షల రూపాయల నగదును పేర్కొన్నారు. కోటీ 28 లక్షల ఆరువేల ఏడు రూపాయల విలువైన చరాస్తులు అఫిడవిట్‌లో చూపారు. వ్యవసాయ భూములు, మిగతా ఆస్తిపాస్టులు కలిపి 2.80 కోట్ల రూపాయలను అఫిడవిట్‌లో పొందుపరిచారు. అలాగే కోల్‌కతాలోని న్యూటౌన్‌లో నిర్మించిన నివాస భవనం విలువ 3.10 కోట్లు ఉంటుందని తెలిపారు. ఐజ్వాల్‌లోని ఝార్‌క్వత్‌లో నివాసం విలువ మాత్రం అఫిడవిట్‌లో పేర్కొనలేదు. సీఎం లాల్ తన్హావాలా భార్య లాల్ రిలియానీ వద్ద 3 లక్షల రూపాయల నగదు, ఆమె పేరుమీద 92,13,740 రూపాయల చరాస్తులు, అలాగే 25 లక్షల విలువైన వ్యవసాయ భూమి ఉంది. అంతేకాకుంతా 15 లక్షల విలువైన వ్యవసాయేతర భూమి ఉన్నట్టు అఫిడవిట్‌లో చూపారు. కాగా పీపుల్స్ రిప్రజెంటేషన్ ఫర్ ఐడింటిటీ, స్టాటస్ ఆఫ్ మిజోరం(పీఆర్‌ఐఎస్‌ఎం) అధ్యక్షుడు, పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి వాన్‌లాల్‌రౌతా కేవలం 30వేల రూపాయలు నగదు, భార్య వద్ద 5వేల రూపాయలు ఉన్నాయని అఫిడవిట్‌లో స్పష్టం చేశారు. ఆయన రెండు బ్యాంక్ అకౌంట్లలో కలిపి 2,175 రూపాయలున్నాయి. భార్య అకౌంట్‌లో 539 రూపాయలున్నాయి. ఆమెకు మిజోరం రూరల్ బ్యాంక్‌లో అకౌంట్ ఉంది. ఆయనకు ఏడున్నర లక్షల విలువైన వ్యవసాయ భూమి ఉంది. అలాగే రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్‌ఎఫ్) అధ్యక్షుడు జోరంతంగా 10 లక్షల రూపాయల నగదు ఉన్నట్టు అఫిడవిట్‌లో చూపించారు. కార్లు, బ్యాంక్ ఖాతాలు తదతరాలు కలిపి 57.22 లక్షల రూపాయలు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వ్యవసాయ భూమి విలువ 20 లక్షల రూపాయలు, ఐజ్వాల్‌లోని ఛాల్ట్‌లాంగ్ ప్రాంతంలోని భవనం విలువ 1.25 కోట్లరూపాయలకుగా చూపించారు. ఆయన భార్య రొనె్హసాంగి వద్ద కేవలం 7 రూపాయలే ఉన్నట్టు పేర్కొన్నారు. బ్యాంకు ఖాతాల్లో 43,756 రూపాయలు చూపించారు. రామ్‌హుమ్ వెంగ్లాయ్ ఏరియాలో భూములు, భవనం విలువ కలిపి 1.5 కోట్ల రూపాయలుగా ఎన్నికల అఫిడవిట్‌లో స్పష్టం చేశారు. అంతేకాకుండా కుమారుడు, కుమార్తె పేరుతో బ్యాంక్ ఖాతాల్లో 28,398 రూపాయలు ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జాన్ వీ హునా అఫిడవిట్‌లో ఎలాంటిన నగదూ పేర్కొనలేదు.
వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువ 1.30 కోట్లుగా వివరించారు. ఇలా ఉండగా జోరం పీపుల్స్ మూవ్‌మెంట్(జేపీఎం) ముఖ్యమంత్రి అభ్యర్థి లాల్‌దుహోమా 70 లక్షల రూపాయల నగదు అఫిడవిట్‌లో చూపించారు. బ్యాంక్ అకౌంట్లు, చరాస్తులు అన్ని కలిపి మరో 18.34 లక్షలున్నట్టు, ఇవికాకుండా భూముల విలువ 1.9 కోట్లని లాల్‌దుహోమా స్పష్టం చేశారు.

చిత్రం.. మిజోరం ముఖ్యమంత్రి లాల్ తన్హావాలా