జాతీయ వార్తలు

ఉగ్రవాదుల్ని ఏరేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పఠాన్‌కోట్, నవంబర్ 12: కాశ్మీర్‌లో శాంతియుత పరిస్థితులకు విఘాతం కలిగించే ఉగ్రవాదులను నిర్మూలించడమే ప్రభుత్వ విధానమని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. అదే విధంగా యువత ఉగ్రవాద బాట పట్టకుండా సైన్యం తన వందు కృషి చేస్తోందని సోమవారంనాడిక్కడ జరిగిన మీడియా సమావేశంలో అన్నారు. ఆధీన రేఖ ద్వారా ఉగ్రవాదుల చొరబాట్లు జరుగుతునా నయని పేర్కొన్న ఆయన ‘రాష్ట్రంలో హింసాకాండ రగిలించేందుకు ఉగ్రవాదులు చేసే ప్రయత్నాలను సాగనివ్వం. ఇందుకు పాల్పడే ఎవరినైనా అంతం చేస్తాం’అని అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం పఠాన్‌కోట్ వచ్చిన రావత్ ఉగ్రవాద దాడుల్లో వికలాంగులైన సైనికుల సదస్సులో మాట్లాడారు. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదుల ఛాయలు లేకుండా చేయాలన్నదే తమ లక్ష్యమని, అదే విధంగా ఈ భావజాలానికి లోనై యువత తప్పుదోవ పట్టకుండా నిరోధిస్తున్నామని అన్నారు. ఇప్పటికే ఈ బాట పట్టిన యువతను సన్మార్గంలోకి తెచ్చేందుకు వారి కుటుంబాలతో మాట్లాడామన్నారు. వీరు సభ్య సమాజంలోకి రావడానికి మరింత అవకాశం ఇస్తున్నామని చెప్పారు. పాకిస్తాన్‌కు సంబంధించి దెబ్బకుదెబ్బ అన్న విధానానే్న ప్రభుత్వం అనుసరిస్తోందా అన్న ప్రశ్నకు ‘ఈ విషయంలో ప్రభుత్వ విధానం మారుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఆధీన రేఖ ప్రాంతంలో అక్కడి పరిస్థితి తీవ్రతను బట్టి వ్యూహాన్ని మారుస్తున్నాం’అని చెప్పారు. పాకిస్తాన్ విషయంలో కుక్కకాటుకు చెప్పుదెబ్బకంటే కూడా తీవ్రస్థాయిలోనే నిరోధక విధానం ఉండాలన్నారు. అయితే తాము చేపడుతున్న చర్యల విషయంలో అనవసరంగా ప్రచారం చేసుకోవడం తమకు ఇష్టం ఉండదన్నారు. పాకిస్తాన్ ఎప్పుడు బరితెగించినా..దానికి తగిన రీతిలో బుద్ధి చెబుతూనే వచ్చామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.