జాతీయ వార్తలు

శబరిమల ఉక్కిరిబిక్కిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శబరిమల (కేరళ), నవంబర్ 12: అన్ని వయసుల మహిళలు అయ్యప్ప దర్శనం చేసుకోవచ్చునని ఒకవైపు సుప్రీం కోర్టు ఉత్తర్వులు, మరోవైపు శబరిమల యాత్ర ప్రారంభం కావడానికి కేవలం ఆరు రోజులే ఉండటం కేరళ ప్రభుత్వం, శబరిమల ఆలయ నిర్వాహకులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వేలాదిమందిగా తరలివచ్చే అయ్యప్ప భక్తులకు కావాల్సిన సౌకర్యాలను కల్పించడం వారికి పెనుసవాల్‌గా మారింది. దానికి తోడు అయ్యప్ప దర్శనానికి మహిళలు సైతం పెద్దయెత్తున వచ్చే అవకాశం ఉన్నందున వారికి కొత్తగా పలు సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత వీరిపై పడింది. అలాగే దర్శనానికి వచ్చే మహిళలను కొందరు ప్రతిఘటించే అవకాశం ఎక్కువగా ఉన్నందున శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఆగస్టులో కేరళను ముంచెత్తిన భారీ వరదల వల్ల పంబాలోని మరుగుదొడ్లు, ఇతర కట్టడాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయ్యప్ప దర్శనానికి ప్రతి రోజు 25 వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు తరలివస్తారని అంచనా. వీరందరికీ కావాల్సిన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ముఖ్యంగా శబరిమల చుట్టుపక్కల పట్టణాలు, ప్రాంతాల్లో కూడా భక్తులకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. గత కొన్ని సంవత్సరాలుగా అయ్యప్పస్వామి దర్శనానికి వస్తున్న రఘు అనే భక్తుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ బేస్ క్యాంపుగా మార్చిన నీలక్కల్‌లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు వస్తుంటారని, ఇక్కడ విశ్రాంతి సౌకర్యం గాని, మరుగుదొడ్ల సౌకర్యం కాని అధికారులు సరిగ్గా ఏర్పాటు చేయలేదని అన్నారు. ఈ ఏడాది మహిళా భక్తులు కూడా అధిక సంఖ్యలో రావచ్చునని, వారికి కూడా సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
భక్తుల సౌకర్యాలపై ట్రావెన్ కోర్ దేవస్వామ్ బోర్డు (టీడీబీ) అధ్యక్షుడు పాదకుమార్ మాట్లాడుతూ నీలక్కల్‌లో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నిర్మాణాలు మరో ఐదు రోజుల్లో పూర్తవుతాయని చెప్పారు. ఇటీవల వచ్చిన వరదల వల్ల పద్మా, నీలక్కల్ ప్రాంతాలను బాగా దెబ్బతీసాయని, దెబ్బతిన్న ప్రాంతాలను స్వల్పకాలంలో పునరుద్ధరణ చేయడం కష్టతరంగా మారిందని అన్నారు. అయితే నాలుగు వేల ఇరుముడులు ఉంచడానికి ఇప్పటికే అక్కడ స్థలం ఉందని ఆయన చెప్పారు. ఇప్పుడున్న వారికి అదనంగా 10 వేల మంది భక్తులు ఉండటానికి వీలుగా మూడు షెడ్లను నిర్మిస్తున్నామన్నారు. ఈ సీజన్‌లో గంటకు 60 వేల లీటర్ల నీరు అవసరమవుతుందని భావిస్తున్నామన్నారు. దీంతో వాటర్ నిల్వకు ట్యాంకులను ఏర్పాటు చేశామని, భక్తులకు సరిపడా నీటిని సరఫరా చేయడానికి సంబంధిత శాఖ తగిన ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు. గత ఏడాది జరిగిన ‘మకర విలక్కు’ కార్యక్రమానికి రికార్డు స్థాయిలో 5.20 లక్షల మంది భక్తులు హాజరయ్యారని, మిగిలిన రోజుల్లో మాత్రం రోజుకు 25 వేలనుంచి లక్ష మంది వచ్చారని ఆయన తెలిపారు. గత ఏడాది వచ్చిన భక్తుల సంఖ్యను బట్టి ఈ ఏడాది వచ్చే భక్తులను అంచనా వేసి దానికి తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. కాగా, అన్ని వయసుల మహిళలకు శబరిమల దర్శనానికి అనుమతి ఇవ్వాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ఇలావుండగా, శబరిమలకు వచ్చే అన్ని పోలీస్ వాహనాలకు ‘పోలీస్ పాస్’ తప్పనిసరిగా ఉండాలని, అది లేని వాహనాలను శబరిమలలో పార్కింగ్ చేయడానికి అనుమతించమని పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.