జాతీయ వార్తలు

అభివృద్ధి దిక్సూచి వారణాసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారణాసి: వారణాసి పుణ్యక్షేత్రం సర్వతోముఖ రీతిలో అభివృద్ధిని సంతరించుకుంటోదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. సోమవారం నాడిక్కడ 2413 కోట్ల రూపాయలతో చేపట్ట తలపెట్టిన హైవేలు, ఇన్‌లాండ్ ప్రాజెక్టులను ప్రారంభించిన సందర్భంగా మోదీ మాట్లాడారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఈ అభివృద్ధి ఆగిపోయిందని, నిజానికి ఇది దశాబ్దాల క్రితమే జరిగి ఉండాల్సిందని ఆయన అన్నారు. ఈ పర్యాటక క్షేత్రం సమీప భవిష్యత్‌లో ప్రాకృత్రిక, సాంస్కృతిక సంగమంగా మారబోతోందని అన్నారు. మారుతున్న కాశీ పట్టణ రూపాన్ని పరిరక్షించుకోవాలని ప్రజలను కోరారు. గత ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించిన మోదీ ‘ఇది చారిత్రక దినం, యావత్‌భారతం, అదేవిధంగా వారణాసి పుణ్యక్షేత్రం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతున్నాయి. నిజానికి ఇది దశాబ్దాల క్రితమే జరిగి ఉండాల్సింది కాని ఆ ప్రభుత్వాలు ఉదాసీనత కారణంగా ఆ ప్రగతి ఆగిపోయింది’ అని అన్నారు. గంగానదిపై బహుముఖ టెర్మినల్‌ను నిర్మించాలన్న ఆలోచనను తాను వ్యక్తం చేసినప్పుడు ప్రతి ఒక్కరూ నవ్వుకున్నారని, ప్రతికూలంగాను మాట్లాడారని మోదీ చెప్పారు. కాని, ఆ ప్రాజెక్టులే నవభారత దృక్పథానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని హర్షధ్వానాల మధ్య అన్నారు. మోదీ.. మోదీ అంటూ సాగిన నినాదాల మధ్య ఆయన తరచూ తన ప్రసంగాన్ని ఆపి ప్రజలకు అభివాదం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ‘ఈ శక్తిని ఇప్పుడే వృథా చేసుకోకండి, 2019లో దీని అవసరం చాలా ఉంది’ అని వ్యంగ్యోక్తి విసిరారు. గంగానదిపై నిర్మించిన మల్టీమోడల్ టెర్మినల్ గురించి మాట్లాడుతూ రవాణా రంగంలో అనూహ్యమైన మార్పులను తరువాతి తరం చూడబోతోందని మోదీ అన్నారు. ఈ పని పూర్తికావడానికి దశాబ్దాలు పట్టినా వారణాసిలోనే ఆ కల నెరవేరడం ఆనందాన్ని కలిగిస్తోందని, దీనివల్ల తూర్పు ఉత్తరప్రదేశ్‌ను జలమార్గాల ద్వారా బంగాళాఖాతంతో సంధానం చేయడం సాధ్యమవుతుందని అన్నారు. ఈ జలమార్గంలోనే తొలి కంటైనర్ కోల్‌కతా నుంచి వస్తోందని, ఇదే నవభారత దృక్పథానికి, ఆవిష్కృతికి సంకేతమని మోదీ అన్నారు. గత ప్రభుత్వాలు జలమార్గాలకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వలేదని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ మార్గలు మరింతగా దెబ్బతిన్నాయని అన్నారు. ఈ ప్రభుత్వాలు చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ జలమార్గాలకు పట్టం గడుతున్నామన్నారు. వందలాది జలమార్గాలను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్న మోదీ వాణిజ్యానికి నదీమార్గాన్ని ఉపయోగించడం అన్నది దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇదే మొదటిసారని అన్నారు. కోల్‌కతా నుంచి ఈ మార్గం ద్వారా వచ్చిన కంటైనర్ ఎరువులతో తిరిగి వెళుతుందని అన్నారు. దీనివల్ల వ్యవసాయానికి, రైతులకు కూడా అనేక అభివృద్ధి మార్గాలు ఆవిష్కృతమవుతాయని మోదీ వెల్లడించారు. జలమార్గాల ద్వారా రవాణాకు ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు.
ఒక కంటైనర్‌లో వచ్చిన ఎరువులు తదితరాలను రహదారి మార్గంలో తీసుకెళ్లాలంటే 16 ట్రక్కులు అవసరమవుతాయని, ఇదే జలమార్గం ద్వారా అయితే 75 వేల రూపాయలను ఆదా చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే దీనివల్ల రహదారులపై భారం తగ్గుతుందని, ఫలితంగా కాలుష్యం తగ్గుముఖం పట్టడంతో పాటు జలమార్గాల్లో టూరిజం కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు. దేశప్రజలు అభివృద్ధి రాజకీయాలను తప్ప మరేమీ కోరుకోవడం లేదని చెప్పారు.
చిత్రం..వారణాసిలో సోమవారం రెండు జాతీయ రహదారులు సముద్ర మార్గాల ప్రాజెక్టును ప్రారంభించిన
సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రజలకు మోదీ అభివాదం. పక్కన యూపీ సీఎం ఆదిత్యనాథ్