జాతీయ వార్తలు

సీబీఐలో మరింత ముదిరిన వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సీబీఐలో అంతర్గత కమ్ములాటలు మరింత ముదిరి పాకాన పడ్డాయి. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ అస్థానాపై జరుగుతున్న దర్యాప్తులో కేంద్ర మంత్రి హరీభాయ్ పత్త్భీయ్ చౌదరి, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అలాగే సీవీసీ కేవీ చౌదరి జోక్యం చేసుకుంటున్నారని సీబీఐ డీఐజీ ఎంకే సిన్హా తీవ్ర ఆరోపణలు చేశారు. సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో సిన్హా అనేక సంచలనాత్మక ఆరోపణలు చేశారు. సీబీఐలో రెండో స్థానంలో ఉన్న ఆయన అస్థానా కేసును దర్యాప్తు చేస్తున్నారు. అలాగే నీరవ్ మోదీ ప్రమేయం ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంపై కూడా సిన్హా దర్యాప్తు చేస్తుండడం గమనార్హం. ఆయనే స్వయంగా అస్థానా కేసులో దోవల్, హరిభాయ్ చౌదరి, కేవీ చౌదరి జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించడం సంచలనం రేకెత్తించింది. తనను నాగ్‌పూర్‌కు బదిలీ చేయడాన్ని రద్దుచేస్తూ
ఈ పిటిషన్‌పై తక్షణ విచారణ జరపాలని ఆయన సుప్రీం కోర్టును కోరారు. సిన్హా తరఫున న్యాయవాది సునీల్ ఫెర్నాండెజ్ ఈ కేసును వాదించారు. తమ క్లయింట్ పిటిషన్‌లో అనేక దిగ్భ్రాంతికరమైన అంశాలున్నాయని వాటిని తక్షణమే లిస్టింగ్‌లో పెట్టి మంగళవారం విచారించాలని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనాన్ని సునీల్ కోరారు. సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మ అభ్యర్థనతోపాటే ఎంకే సిన్హా పిటిషన్ కూడా మంగళవారం విచారణకు చేపట్టాలని అభ్యర్థించారు. అయితే ‘మమ్మల్ని ఏదీ దిగ్భ్రాంతి పరచలేదు’ అని వ్యాఖ్యానించిన బెంచ్ ఈ పిటిషన్‌పై తక్షణ విచారణకు నిరాకరించింది. తమను తప్పించడాన్ని సవాల్ చేస్తూ అలోక్‌వర్మ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టులోనే ఉండాలని ఫెర్నాండెజ్‌ను ధర్మాసనం ఆదేశించింది. తనను నాగ్‌పూర్ బదిలీచేసి అస్థానపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌పై దర్యాప్తుచేస్తున్న బృందం నుంచి తప్పించాలని సిన్హా ఆరోపించారు. తనను ఏకపక్షంగా, దురుద్దేశపూర్వకంగా బదిలీ చేశారని ఆయన వాపోయారు. కొందరు అధికారంలో ఉన్న వ్యక్తులకు వ్యతిరేకంగా స్పష్టమైన సాక్ష్యాధారాలు సేకరించిన ఓ అధికారిని బలిచేశారని 34 పేజీల పిటిషన్‌లో సిన్హా పేర్కొన్నారు. సిన్హా 2000 సంవత్సరం ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారి.
సుప్రీంకు అలోక్‌వర్మ వివరణ
తనపై దాఖలైన అవినీతి ఆరోపణలకు సంబంధించి సీబీఐ డైరెక్టర్ అలోక్‌కుమార్ వర్మ సోమవారం సుప్రీం కోర్టులో సమాధాన పత్రాలను దాఖలు చేశారు. సీల్డ్ కవర్‌లో ఆయనీ పత్రాలు బెంచ్‌కు అందించారు. ఈ కేసు మంగళవారం విచారణకు వస్తున్నందున సాధ్యమైనంత త్వరగా సీవీసీ దర్యాప్తుపై సమాధానం ఇవ్వాలని సుప్రీం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి తనకు మరింత వ్యవధి కావాలని వర్మ కోరినప్పటికీ సుప్రీం కోర్టు నిరాకరించడంతో అత్యవరంగా సీల్డ్ కవర్లో తన సమాధాన పత్రం అందించారు. సీవీసీ దర్యాప్తుపై వర్మ సమాధానాన్ని తాము పరిశీలించాల్సి ఉన్నందున ఎలాంటి జాప్యం లేకుండా దాన్ని అందించాలని చీఫ్ జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ ఆయన న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్‌కు స్పష్టం చేసింది. అదనపు గడువు కోరినప్పటికీ సోమవారం మధ్యాహనం 1 గంటకే వర్మ సమాధానం సుప్రీంకు సమర్పించడం జరిగిందని శంకరనారాయణన్ స్పష్టం చేశారు.