జాతీయ వార్తలు

రెండోదశ పోలింగ్‌లో దిగ్గజ నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌పూర్, నవంబర్ 19: చత్తీస్‌గఢ్‌లో మంగళవారం జరిగే రెండో దశ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. గిరిజనులు అధికంగా ఉండే నియోజకవర్గాల్లో అనేక మంది అతిరధమహారథులు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి, ఆయన కుటుంబ సభ్యులు ఇద్దరు, మాజీ ఐఏఎస్ ఓపీ చౌదరి, రాజుల కుటుంబానికి చెందిన టీఎస్ సింగ్‌దేవ్ సహా అనేక మంది ప్రముఖులు పోటీలో ఉన్నారు. ఆదివారం సాయంత్రంతోనే ఎన్నికల ప్రచారానికి తెరపడింది. రెండోదశలో 72 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ సొంత జిల్లా కవర్ధాలోనూ ఎన్నికలు నిర్వహణకు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. కవర్ధాలో రమణ్‌సింగ్‌కు ఓటు ఉన్నప్పటికీ ఆయన రాజానంద్‌గావ్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. అక్కడ ఈనెల 12నే పోలింగ్ పూర్తయింది. ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు అన్నదేమీ ఉండదు. ఈసారి కచ్చితంగా బీజేపీనే గెలుస్తుంది. మేం తిరగి అధికారంలోకి వస్తున్నాం’అని సింగ్ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో వెల్లడించారు. చత్తీస్‌గఢ్ ఏర్పడి 18 ఏళ్లు పూర్తవ్వగా 15 సంవత్సరాలు రమణ్‌సింగే సీఎంగా ఉన్నారు. అన్ని ఎన్నికల్లోనూ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటూ వచ్చింది. ఈసారి మాజీ సీఎం అజిత్ జోగీ, మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్‌వాదీ పార్టీలు ఫ్రంట్‌గా ఏర్పడి ఎన్నికల బరిలో ఉన్నాయి. దీంతో త్రిముఖ పోటీ అనివార్యమైంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఓటమే లక్ష్యంగా అజిత్ జోగి ప్రచారం చేశారు. అజిత్ జోగి కుమారుడు అమిత్‌జోగి తప్ప మిగిలిన ఆయన కుటుంబ సభ్యులందరూ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అజిత్‌జోగి మార్వాహీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. జోగి భార్య రేణు కొంతా, ఆయన కోడలు రిచా జోగి (బీఎస్పీ) అకల్తరా నుంచి పోటీ చేస్తున్నారు. అజిత్ జోగి కొత్త జనతా కాంగ్రెస్ చత్తీస్‌గఢ్, బీఎస్పీతో పొత్తుపెట్టుకుని ఎన్నికల బరిలో ఉంది. ఇలా ఉండగా రెండోవిడత పోలింగ్ అత్యంత కీలకంగా చెప్పవచ్చు. పదిమంది మంత్రుల జాతకాలు మంగళవారం తేలిపోనున్నాయి. బ్రిజ్‌మోహన్ అగర్వాల్(రాయ్‌పూర్ సౌత్), అమర్ అగర్వాల్( బిలాస్‌పూర్), రాజేష్ మునాట్(రాయ్‌పూర్ వెస్ట్) నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికలకు ఓ ప్రాధాన్యత ఉంది. అజిత్‌జోగి, ఓపీ చౌదరి ఇద్దరూ ఐఎఎస్‌లే. వారిద్దరూ ఐఎఎస్ పదవులను వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు. జిల్లా కలెక్టర్లుగా పనిచేసి ఎలక్ట్రోరల్ పాలిటిక్స్‌లోకి ప్రవేశించారు. ఇండోర్ కలెక్టర్లుగా పనిచేస్తూ అజిత్ జోగి రాజీనామా చేశారు. జోగి కాంగ్రెస్‌లోకి ప్రవేశించారు. తొలుత రాజ్యసభకు వెళ్లిన అజిత్ చత్తీస్‌గఢ్ ఏర్పడ్డాక తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన 2003 వరకూ సీఎంగా ఉన్నారు. ఇక ఓపీ చౌదరి విషయాన్ని వస్తే..ఆయన రాయ్‌పూర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తూ రాజీనామా చేశారు. బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఆయన ఖరాసియా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఖరాసియాలో దివంగత కాంగ్రెస్ నేత నందకుమార్ పటేల్ కుమారుడు ఉమేష్ పటేల్ బరిలో ఉన్నారు. నందకుమార్ జిరాంఘటీలో నక్సల్స్ దాడిలోమృతి చెందారు. నందకుమార్‌తోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు మరణించారు. అలాగే జంజిగిర్-్ఛంపా జిల్లాలోని సక్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత చరణ్‌దాస్ మహంత్ పోటీ చేస్తున్నారు. చరణ్‌దాస్ కాంగ్రెస్ సీఎం అధ్యర్థిఅంటూ ప్రచారం జరుగుతోంది. పీసీసీ అధ్యక్షుడు భూపేష్ బఘెల్ ‘దుర్గ్’నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు.
కాగా 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 49 స్థానాల్లో, కాంగ్రెస్ 39 స్థానాల్లో గెలిచాయి. బీఎస్పీ, ఇండిపెండెంట్లు చెరో స్థానాన్ని గెలుచుకున్నాయి. చత్తీస్‌గఢ్ తొలిదశ పోలింగ్ నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లోని 18 నియోజకవర్గాల్లో జరిగింది. ఏకంగా 76.28 శాతం ఓట్లు పోలయ్యాయి. రెండోదశలో కూడా భారీగానే ఓట్లు పోలవుతాయని భావిస్తున్నారు. 2013 ఎన్నికల్లో 90 నియోజకవర్గాల్లో 74.65 శాతం ఓట్లు పోలయినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

చిత్రం.. చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల రెండోదశ పోలింగ్‌లో భాగంగా సోమవారం నాడు
రాయ్‌పూర్‌లో ఎన్నికల సామగ్రిని సిద్ధం చేసుకుంటున్న అధికారులు