జాతీయ వార్తలు

రాజస్థాన్ మాదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, నవంబర్ 19: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం సాధిస్తుందని పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు రెండు పార్టీల సిద్ధాంతాల మధ్య జరుగుతున్నాయని ఆయన అభివర్ణించారు. టాంక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న సచిన్ పైలట్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ‘టాంక్ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలోని మెజారిటీ స్థానాల్లో మా పార్టీ ఘన విజయం సాధిస్తుంది’అని ఆయన జోస్యం చెప్పారు. బీజేపీ ఓటమి ఖాయమని ఆయన అన్నారు. కాంగ్రెస్‌కే ఓట్లు వేయాలని ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చేశారని పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. రాష్టమ్రంతటా కాంగ్రెస్ గాలి వీస్తోందని ఆయన తెలిపారు. పైలట్‌పై కమలనాథులు యూనుస్‌ఖాన్‌ను పోటీకి నిలబెట్టింది. ఖాన్ కూడా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏకైక ముస్లిం అభ్యర్థి యూనుస్‌ఖాన్. నామినేషన్ దాఖలు సందర్భంగా ఖాన్ మీడియాతోమాట్లాడుతూ ‘కులం,మతం గురించి నేను స్పందించను. కాకపోతే తొలిసారి సచిన్ పైలట్ ముఖంలో టెన్షన్ చూస్తున్నాను. మేం ఇద్దరం కూడా టాంక్ నియోజకవర్గానికి కొత్తే’అని ఆయన అన్నారు. తన సేవలను బీజేపీ ఎలా ఉపయోగించున్నా సహకరిస్తానని, అది రాష్టమ్రా, దేశమా అన్నది హైకమాండ్ ఇష్టం అని యూనుస్ పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధికి తానెంతోపాటుపడ్డానని ఆయన చెప్పారు. కాగా ఆదివారం విడుదల చేసిన బీజేపీ ఐదో జాబితాలో అనూహ్యంగా యూనుస్‌ఖాన్ పేరు వచ్చింది. అంతకు ముందు టాంక్ నియోజకవర్గం నుంచి అజిత్‌సింగ్ మెహతా ప్రాతినిధ్యం వహించారు. పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ పోటీ చేస్తుండడంతో బీజేపీ ఖాన్‌ను బరిలోకి దించింది. ఖాన్ నాగౌర్ జిల్లా దీద్‌వానా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంతకు ముందు నాలుగు జాబితాలు విడుదలచేసిన బీజేపీ అధినాయకత్వం ఆయన ఎక్కడ పోటీ చేసేది ఆఖరి వరకూ సస్పెన్షన్‌లో ఉంచి చివరికి టోంక్‌కు ఖరారు చేసింది. ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండే టాంక్‌లో నిలబెట్టడం ద్వారా సచిన్ పైలెట్‌కు చెక్‌పెట్టాలని బీజేపీ భావిస్తోంది. రాజస్థాన్ అసెంబ్లీకి డిసెంబర్ 7న పోలింగ్ జరుగుతోంది.

చిత్రాలు.. నామినేషన్ దాఖలు చేస్తున్న అశోక్ గెహ్లాట్
*నామినేషన్ దాఖలు చేసేందుకు ర్యాలీగా వెళుతున్న సచిన్ పైలట్