జాతీయ వార్తలు

అర్ధరాత్రి అలజడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శబరిమల, నవంబర్ 19: అర్థరాత్రి అయ్యప్ప ఆలయం వద్ద అలజడి రేగింది. ప్రభుత్వం విధించిన ఆంక్షలను భక్తులు తీవ్రంగా నిరసించారు. ప్రశాంతంగా ఉండాల్సిన ఈ ప్రాంతంలో పోలీసుల బూట్ చప్పుళ్లు, ఈ పహారాలు ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన సంఘటనలను పురస్కరించుకుని ప్రభుత్వం పలుచోట్ల 144 సెక్షన్‌ను విధించింది. దీంతో ఆదివారం ఆలయ పరిసర ప్రాంతంలోని భక్తులను పోలీసులు ఖాళీ చేయించారు. దీంతో ఆదివారం అర్థరాత్రి భక్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 68మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని మన్నియర్ క్యాంపునకు తరలించారు. శబరిమలలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి. దీనిని బీజేపీ, యువమోర్చా కార్యకర్తలు తీవ్రంగా నిరసించారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికార గృహం ముందు సహా, రాష్టవ్య్రాప్తంగా వారు ఆందోళనలు నిర్వహించారు. కాగా, తాము భక్తుల మనోభావాలను గౌరవిస్తామని, అరెస్టయిన వారు భక్తులు కాదని ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టం చేశారు. ఆలయం వద్ద అలజడి సృష్టించడానికి సన్నిధానం వద్ద ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు మోహరించారని, వారే ఈ ఆందోళనకు పూనుకొన్నారని ఆయన ఆరోపించారు. అలాంటి చర్యలను తమ ప్రభుత్వం ఎంతమాత్రం సహించదని ఇక్కడ జరిగిన కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల రాష్ట్ర సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. ఇదిలావుండగా అయ్యప్ప భక్తులను అరెస్టు చేయడాన్ని కేంద్రమంత్రి ఆల్ఫోన్స్ కన్నానందం తీవ్రంగా ఖండించారు. సోమవారం ఇక్కడ బేస్ క్యాంపును సందర్శించిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పవిత్రమైన ఆలయ ప్రాంతాన్ని యుద్ధ్భూమిగా మార్చేస్తోందని ఆరోపించారు. ఇక్కడ యాత్రికులను దొంగలుగా చిత్రీకరిస్తున్నారని, ప్రశాంత వాతావరణంలో గడపడానికి ఇక్కడికి వచ్చే భక్తులపై 144 సెక్షన్ ప్రయోగించడమేమిటని ఆయన ప్రశ్నించారు. టెంపుల్ కాంప్లెక్స్‌లో కనీస సౌకర్యాలు కూడా లేవని, శబరిమలలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడానికి కేంద్రం వంద కోట్ల రూపాయలు కేటాయించిందని, కాని దానిలో ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయలేదని ఆయన ఆరోపించారు.
కాగా, ఆలయం వద్ద 144 సెక్షన్ విధించడాన్ని, కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడాన్ని ఆక్షేపిస్తూ సోమవారం అయ్యప్ప నామజపం చేస్తూ రాష్టవ్య్రాప్తంగా నిరసనలు తెలిపారు. ఇలావుండగా కేంద్ర మంత్రి ఆరోపణల నేపథ్యంలో కేరళ దేవస్థాన మంత్రి కడకంపల్లి సురేంద్రన్ మాట్లాడుతూ శబరిమల అభివృద్ధి నిమిత్తం కేంద్రం 2016లో 99.98 కోట్లతో స్పిరిట్యువల్ సర్క్యూట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిందని, అయితే అందులో 18కోట్ల రూపాయలను మాత్రమే విడుదల చేసిందని చెప్పారు. ఆదివారం రాత్రి భక్తులను అరెస్టు చేయడాన్ని బీజేపీ, యువమోర్చా తీవ్రంగా నిరసించింది. సోమవారం వారు జెండాలను ఊపుతూ నిరసన తెలిపారు. వారిలో ఇద్దరు ముఖ్యమంత్రి కాన్వాయ్‌కు అడ్డంగా వెళ్లడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు కోజికోడ్ జిల్లా పోలీస్ చీఫ్ ఎస్.కాళిరాజు మహేష్ కుమార్ తెలిపారు. అలాగే నిరసనకారులు తిరువనంతపురం లోని సచివాలయానికి ర్యాలీ నిర్వహించారు.
పవిత్రమైన శబరిమల ఆలయంలో ఖలిస్థాన్ తరహా నిరసనకు ఆర్‌ఎస్‌ఎస్ పాల్పడుతోందని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణ ఆరోపించారు. అయ్యప్ప భక్తులపై పరివార్ ముద్రను వేసి పోలీసులు అరెస్టు చేయడం క్రూరమైన చర్య అని విపక్ష నాయకుడు రమేష్ చెన్నితల విమర్శించారు. కాగా తమ మనవళ్లను చోరున్ను సెరిమనీ కార్యక్రమం నిర్వహించే నిమిత్తం ఇక్కడకు వచ్చిన హిందూ ఐక్య వేదిక అధ్యక్షురాలు కెపి శవికళకు ఎస్పీ యతీష్ చంద్ర నోటీసు జారీ చేశారు. ఆమె సన్నిధానం ప్రాంతంలో ఆరు గంటలు మాత్రమే ఉండటానికి అనుమతి ఉందని పేర్కొన్నారు. కాగా, పోలీసుల నియమాలను ఉల్లంఘించిన ఆమెను రెండు రోజుల క్రితం ఆమెను ముందు జాగ్రత్త చర్యగా కస్టడీలోకి తీసుకుని మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు.
చిత్రం.. శబరిమలలోని సన్నిధానం వద్ద ఆంక్షలకు వ్యతిరేకంగా నామజప నిరసన వ్యక్తం చేస్తున్న
అయ్యప్ప భక్తులను నిర్భంధంలోకి తీసుకుంటున్న పోలీసులు