జాతీయ వార్తలు

ఇందిరతో మోదీకి పోలికా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఇందిరాగాంధీతో ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీకి ఏ కోశాన పోలికలేదని, పెద్ద నోట్ల రద్దు వంటి తుగ్లక్ నిర్ణయాన్ని ఏమాత్రం తీసుకుని ఉండేవారు కాదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ అన్నారు.
ఇందిరాగాంధీ 101 జయంతి సందర్భంగా సోమవారం నాడిక్కడ ఒక పుస్తకాన్ని యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఆవిష్కరించారు. అనంతరం జైరాం రమేష్ మీడియాతో మాట్లాడారు. ఆయన ఇందిరాగాంధీ వ్యక్తిత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఎవరితోనూ సరిపోల్చడానికి వీలులేదని అన్నారు. ఆమె తీసుకున్న నిర్ణయాలన్నీ దూరదృష్టితో కూడికుని ఉన్నాయని, దేశ దీర్ఘకాల ప్రయోజనాలను పరిరక్షించేవిగా ఉండేవని రమేష్ తెలిపారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల పర్యావరణ పరిరక్షణ చట్టాలు నీరుగారిపోతున్నాయని అన్నారు. పర్యావరణ సమతూకాన్ని పరిరక్షించే చర్యలను కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం చేపట్టడం లేదని చెప్పారు. ఒక పక్క తాను పర్యావరణ పరిరక్షకుడిగా చెప్పుకుంటున్న నరేంద్రమోదీ అంతర్జాతీయంగానూ ఒక పురస్కారాన్ని అందుకున్నారని, ఆయన పాలనలో ఉన్న భారత్ మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని ఆయన అన్నారు. 2014లో అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే పర్యావరణ పరిరక్షణ చట్టాలను కేంద్రం నీరుగారుస్తూ వచ్చిందని, వాటిలో అనవసరమైన మార్పులు తెస్తూ బలహీన పరిచిందని విమర్శించారు. ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణ శాఖ కూడా బలహీన పడిందని, సహజ వనరులను కాపాడే బదులు త్వరితగతిన ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వడమే పనిగా పెట్టుకుందని అన్నారు. వ్యాపార అనుకూలత పేరుతో పర్యావరణ చట్టాలను, నియమ నిబంధనలను నీరుగారుస్తున్నారని, ఒక పద్ధతి ప్రకారం వాటిని కనుమరుగు చేస్తున్నారని విమర్శించారు.
ఇందిరకు నివాళులు
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 101వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ సహా వివిధ పార్టీలకు చెందిన నేతలు సోమవారం నాడిక్కడ ఘన నివాళులు అర్పించారు. శక్తిస్థల్‌కు వచ్చి సోనియా, రాహుల్, ప్రణబ్, మన్మోహన్ తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు. జాతి నిర్మాణంలో ఇందిర చేసిన కృషి నిరుపమానమని నేతలు శ్లాఘించారు.

చిత్రం..మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలోని మెమోరియల్
మ్యూజియం వద్ద వివిధ కళాకారులతో రాహుల్ గాంధీ ఓ అరుదైన క్షణాన్ని పంచుకున్న దృశ్యం