జాతీయ వార్తలు

కేజ్రీవాల్‌పై కారం పొడితో దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై ఒక ఆగంతకుడు కారం పొడితో దాడి చేశాడు. హై సెక్యూరిటీ జోన్‌గా భావించే ఢిల్లీ సచివాలయంలో జరిగిన సంఘటనను ‘రాజకీయ ప్రేరేపిత దాడి’గా ఆప్ ఆరోపించింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయం నుంచి భోజనం నిమిత్తం బయటకు వస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై ఒక వ్యక్తి కారంపొడి చల్లి దాడి చేశాడు. ఈ సంఘటనలో కేజ్రీవాల్ కళ్లద్దాలు పగిలిపోయాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన అనంతరం ’నేను జైలు నుంచి వచ్చిన తర్వాత నిన్ను కాల్చిపారేస్తా’ అని కేజ్రీవాల్‌ను బెదిరించినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నిందితుడిని నరైన ప్రాంతానికి చెందిన అనిల్ శర్మ (40)గా గుర్తించినట్టు పోలీసులు చెప్పారు.
ఇది రాజకీయ దాడే: ‘కచ్చితంగా ఇది రాజకీయ దాడే, ఢిల్లీ పోలీసులతో కుమ్మకై బీజేపీ ఈ కుట్రకు పాల్పడింది’ అని జరిగిన సంఘటనపై ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరోపించారు. ఇలాంటి చిల్లర పనులతో తమ పార్టీ పరువును ఎంతమాత్రం దిగజార్చలేరని ఆయన పేర్కొన్నారు. దీనిపై బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారి మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు ఉపేక్షించరాదని అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారెవరికైనా శిక్ష తప్పదని అన్నారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలన్నారు. సంఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రి వెనుకే ఉన్న పార్టీ అధికార ప్రతినిధి రాఘవ చంద జరిగిన సంఘటనపై ట్వీట్ చేస్తూ ఢిల్లీ పోలీసుల వైఫల్యం ఈ సంఘటనతో బయటపడిందని అన్నారు. ఒక ముఖ్యమంత్రికి భద్రత కల్పించే పద్ధతి ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. ఈ సంఘటనలో ముఖ్యమంత్రి కళ్లజోడు మాత్రమే పగిలిందని, అలా కాకుండా ఆగంతకుడు ఏదైనా ప్రమాదకరమైన ఆయుధాన్ని తీసుకుని వచ్చి ఉంటే జరిగే విషాదానికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సిసోడియా విలేఖరులతో మాట్లాడుతూ నెలరోజుల వ్యవధిలో కేజ్రీవాల్‌పై దాడి జరగడం ఇది మూడోసారని ఆరోపించారు. ఇటీవల ఒక బ్రిడ్జి ప్రారంభ కార్యక్రమానికి వచ్చిన కేజ్రీవాల్‌పై దాడి జరిగిన సంఘటనను ఆయన గుర్తు చేశారు. ఈ దాడి వెనుక బీజేపీ హస్తం ఉందని ఆప్ అధికార ప్రతినిది సౌరభ్ భరద్వాజ ఆరోపించారు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం 2.25 గంటలకు జరిగిందని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. సిబ్బందిలోని కొందరి సిఫార్సుతో లోపలికి వచ్చిన అనీల్‌శర్మ ఒక ఫిర్యాదును ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు అందజేయడానికి ప్రయత్నించాడని చెప్పారు.