జాతీయ వార్తలు

బీజేపీకి ఓటమి తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాంఫయ్ (మిజోరం), నవంబర్ 20: వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో తాము విజయం సాధించమన్న విషయం ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలకు బాగా తెలుసని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. మిజోరం శాసనసభ ఎన్నికలను పురస్కరించుకుని మొదటిసారిగా ఇక్కడ జరిగిన సభలో మంగళవారం ఆయన మాట్లాడుతూ మిజోరం రాష్ట్ర సంస్కృతిని నాశనం చేయడానికి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ‘మిజోరంలో తాము అడుగుపెట్టడానికి ఇదే ఆఖరి అవకాశమని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు గ్రహించాయి.. అందుకే వారు ఈ రాష్ట్రంలో సాంస్కృతిక విధ్వంసానికి పాల్పడుతున్నాయి’ అని రాహుల్ ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రధాన విపక్షంగా ఉన్న మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్), బీజేపీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ వస్తుందన్న ఉద్దేశంతో ఎంఎన్‌ఎఫ్, బీజేపీలు ఎన్నికల అనంతరం భాగస్వాములవుతాయని అన్నారు. ఎంఎన్‌ఎఫ్ లాంటి పార్టీ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ రాష్ట్ర సంస్కృతిని, భాషను, సంప్రదాయ, చరిత్రను నాశనం చేస్తోందని రాహుల్ విమర్శించారు. ఇలాంటి విభజన ఆలోచనలను కాంగ్రెస్ మొదటినుంచి తీవ్రంగా ప్రతిఘటిస్తోందని ఆయన అన్నారు.
రాఫెల్ జెట్ల కొనుగోలు విషయంలో జరిగిన అవినీతిని ఈ సందర్భంగా రాహుల్ ప్రస్తావిస్తూ ఈ వ్యవహారంలో అనిల్ అంబానీ కంపెనీకి మోదీ 30 వేల కోట్లరూపాయలను వ్యక్తిగతంగా అందజేశారని ఆరోపించారు. మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ జనరేట్ యాక్టు (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ) పథకం కింద దేశమంతా ఖర్చు చేసే మొత్తానికి ఇది సమానమని ఆయన వివరించారు. ఒక పక్క ఈ డీల్‌కు సంబంధించి వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని రిలయన్స్ కంపెనీ ఖండిస్తుండగా, ఫ్రాన్స్‌కు చెందిన డస్సాల్ట్ కంపెనీ తమకు కావాల్సిన ఆఫ్‌సెట్ అవసరాల నిమిత్తం రిలయన్స్‌తో జాయింట్ వెంచర్ ఉందని పేర్కొంటున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. మిజోరం రాష్ట్ర ప్రగతిని ఆయన ప్రస్తావిస్తూ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మెచ్చుకోదగ్గ రీతిలో ఉందని అన్నారు. కాంగ్రెస్‌కు చెందిన లాన్ తన్హావాలా నేతృత్వంలో గత పది సంవత్సరాలుగా రాష్ట్రంలోని ప్రజల ఆదాయం రెట్టింపు అయ్యిందని చెప్పారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది 11వేల మందికి కొత్త ఉద్యోగాలు కల్పించి ఈశాన్య రాష్ట్రాల్లో మిజోరంను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఆయన హామీనిచ్చారు. ఈసందర్భంగా 1987లో తన తండ్రి రాజీవ్‌గాంధీతో చిన్నప్పుడు మిజోరమ్‌ను సందర్శించిన జ్ఞాపకాలను ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు. తన తండ్రితో కలిసి మిజోరామ్ వీధుల్లో తిరిగానని, మిజోరామ్‌లో విజయం సాధించిన తర్వాత తాను మళ్లీ ఇక్కడకు వచ్చి అంతా తిరిగి ప్రజలను కలవాలనుకుంటున్నట్టు రాహుల్‌గాంధీ చెప్పారు.

చిత్రాలు.. అభిమానులతో సరదాగా సెల్ఫీలు * (ఇన్‌సెట్‌లో) ర్యాలీలో ఆత్మీయంగా ఓ చిన్నారిని ఎత్తుకున్న రాహుల్‌గాంధీ