జాతీయ వార్తలు

సీబీఐ లాంటి సంస్థలపై మోదీ పెత్తనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐజ్వాల్, నవంబర్ 20: స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎలక్షన్ కమిషన్, సీబీఐ లాంటి సంస్థల పనితీరులో మోదీ ప్రభుత్వం జోక్యం చేసుకుని, పెత్తనం చెలాయిస్తూ వాటి విధి నిర్వహణలో ఆటంకాలు సృష్టిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. మిజోరం రాజధాని ఐజ్వాల్‌లో మంగళవారం జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ ప్రజల సొమ్మును దోపిడీ చేస్తున్న ప్రధాని మోదీ దానిని ప్రచారానికి వాడుకుంటున్నారని విమర్శించారు. ఆయన ప్రభుత్వం ప్రణాళికా సంఘం, ఆర్‌బీఐ, సీబీఐ, ఎన్నికల కమిషన్‌ల వ్యవహారాల్లో తీవ్రంగా జోక్యం చేసుకుంటోందని అన్నారు. ప్రభుత్వ జోక్యం వల్ల అవి వాటి పనిని సరిగ్గా చేసుకోలేకపోతున్నాయని అని ఇటీవల నలుగురు సుప్రీం కోర్టు జడ్జిలు వ్యాఖ్యానించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా రాహుల్ ఉటంకించారు.
ఇక్కడ పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం ఊహించని అభివృద్ధిని సాధించిందని, మిజోరామ్ తలసరి ఆదాయం జాతీయ తలసరి ఆదాయం కన్నా ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు. ప్రజలు, చర్చిలు, పౌర సంఘాల సమష్టి కృషి వల్లే ఇది సాధ్యపడిందని రాహుల్‌గాంధీ చెప్పారు.