జాతీయ వార్తలు

జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, నవంబర్ 21: జమ్మూకాశ్మీర్ అసెంబ్లీకి సంబంధించి బుధవారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. జమ్మూకాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ బుధవారం రాత్రి అకస్మాత్తుగా రాష్ట్ర శాసనసభను రద్దు చేశారు. సుస్థిరమయిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రెండు రాజకీయ పార్టీలు ముందుకు వచ్చిన తరుణంలో గవర్నర్ సుప్తచేతనావస్థలో ఉన్న శాసనసభను రద్దు చేయడం సంచలనం సృష్టించింది. అసెంబ్లీలో 29 మంది సభ్యులున్న అతి పెద్ద పార్టీ పీడీపీ, కేవలం ఇద్దరు సభ్యులున్న పార్టీ
పీపుల్స్ కాన్ఫరెన్స్ ఒకటి తరువాత ఒకటి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ముందుకు వచ్చిన తరువాత గవర్నర్ ఏకంగా శాసనసభనే రద్దు చేశారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మద్దతు ఉపసంహరించుకున్న తరువాత మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడంతో జమ్మూకాశ్మీర్‌లో ఆరు నెలల కోసం జూన్ 19వ తేదీన గవర్నర్ పాలనను విధించారు. రాజకీయ పార్టీలు కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం ఉన్న మార్గాలను అనే్వషించడానికి వీలుగా అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచారు. కాగా, రాష్ట్ర రాజ్యాంగంలోని సంబంధిత నిబంధనల కింద గవర్నర్ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసినట్టు ఒక అధికారిక ప్రకటన బుధవారం రాత్రి వెల్లడించింది. దీంతో జమ్మూకాశ్మీర్ మరోసారి కేంద్ర పాలనలోకి వెళ్లడానికి రంగం సిద్ధం అయింది. డిసెంబర్ 18తో గవర్నర్ ఆరు నెలల పాలన ముగుస్తుంది. ఆ తరువాత కేంద్ర పాలన అమలులోకి వస్తుంది.
అంతకు ముందు మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు. సభలో 12 మంది సభ్యులున్న కాంగ్రెస్, 15 మంది సభ్యులున్న నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) మద్దతుతో తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ఆమె బుధవారం గవర్నర్‌కు ఒక లేఖను మెయిల్ చేశారు. 87 మంది సభ్యులున్న జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో కాంగ్రెస్, ఎన్‌సీల మద్దతుతో మెహబూబా ముఫ్తీ బలం 56కు పెరుగుతుంది. అంటే మ్యాజిక్ ఫిగర్ 44 కన్నా చాలా ఎక్కువే. లేఖను ఫాక్స్‌లో పంపిస్తామంటే రాజ్‌భవన్‌లో ఫాక్స్ పనిచేయడం లేదని, ఫోన్ కూడా పనిచేయడం లేదని ఆమె సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన రెండు సందేశాలలో పేర్కొన్నారు.
అయితే, మెహబూబా ముఫ్తీ ఈ ప్రకటన చేసిన కొద్ది సేపటికే, సభలో కేవలం ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్న పీపుల్స్ కాన్ఫరెన్స్ (పీసీ) పార్టీ నాయకుడు సజ్జాద్ లోన్ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు. పీపుల్స్ కాన్ఫరెన్స్ నుంచి సజ్జాద్‌తో పాటు మరో సభ్యుడు రాష్ట్ర అసెంబ్లీలో ఉన్నారు. 25 మంది సభ్యులున్న బీజేపీతో పాటు మరో 18 మంది సభ్యులు తనకు మద్దతు ఇస్తున్నారని సజ్జాద్ గవర్నర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. అయితే, ఆ 18 మంది సభ్యులు ఎవరనేది ఆయన వెల్లడించలేదు. ఎప్పుడు కోరితే అప్పుడు బీజేపీ నుంచి, ఇతర 18 మంది సభ్యుల నుంచి మద్దతు లేఖలను తాను సమర్పిస్తానని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.