జాతీయ వార్తలు

ప్రాంతీయ పార్టీల్లో స్వేచ్ఛ ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 21: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చారు.. ఒక కుటుంబానికి చెందిన పార్టీగా మారిన టీఆర్‌ఎస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం, స్వేచ్ఛా స్వతంత్రాలు లేకుండా పోయాయని లోక్‌సభ సభ్యుడు కొండా విశే్వశ్వర రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశం అనంతరం విలేఖరులతో మాట్లాడారు. తాను శుక్రవారం మేడ్చెల్‌లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంతోపాటు తన లోక్‌సభ నియోజకవర్గం సమస్యలను పరిష్కరించేందుకు పూర్తి సహాయ, సహకారాలు అందజేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని విశే్వశ్వర రెడ్డి చెప్పారు. టీఆర్‌ఎస్ పార్టీకి, లోక్‌సభ స్థానానికి రాజీనామా చేసేందుకు దారితీసిన పరిస్థితుల గురించి రాహుల్ గాంధీకి వివరించానని అన్నారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా ఆయన వెంట ఉన్నారు. తాను ప్రస్తావించిన సమస్యలను సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని విశే్వశ్వర రెడ్డి తెలిపారు. సాగునీరు, ట్రిపుల్ వన్ జీవో, వికారాబాద్‌ను శాటిలైట్ నగరంగా అభివృద్ధి చేయటం, తాండూరు సమస్యలను పరిష్కరించటం, ఎంఎంటీఎస్ రైలును ఏర్పాటు చేయాలని కోరానని.. రాహుల్ గాంధీ వీటన్నింటికి అంగీకరించారని విశే్వశ్వర రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఈ సమస్యలన్నీ పరిష్కరమవుతాయనే విశ్వాసం తనకున్నదని ఆయన తెలిపారు. రాష్ట్రానికి చెందిన స్థానిక మంత్రితో ఉన్న వ్యక్తిగత కారణాల మూలంగానే మీరు టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారనే మాట వినిపిస్తోందని ఒక విలేఖరి ప్రశ్నించగా తాను టీఆర్‌ఎస్‌లో చేరినప్పటి నుండి ఈ విభేదాలున్నాయి.. ఇదే నిజమైతే తాను నాలుగేళ్ల క్రితమే రాజీనామా చేయాలి కదా? అని విశే్వశ్వర రెడ్డి ఎదురు ప్రశ్న వేశారు. చంద్రశేఖరరావు మొదటి రెండేళ్లు సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా పనిచేశారు.. మంచి ప్రాజెక్టులు చేపట్టారు.. అయితే గత రెండేళ్ల నుండి పరిస్థితి పూర్తిగా మారిపోయింది.. తానీ రెండేళ్ల నుండి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాను.. కొందరు వ్యవహరించిన తీరుమూలంగా తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయానని విశే్వశ్వర రెడ్డి వివరించారు. తానింతకాలం పార్టీలో ఉండే పోరాడాను.. అయితే ప్రాంతీయ పార్టీలో స్వాతంత్వ్రం ఉండదు.. అందుకే తన పోరాటంలో విజయం సాధించలేకపోయానని ఆయన చెప్పారు. కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీల్లో అంతర్గత స్వాతంత్వ్రం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. టీఆర్‌ఎస్ ఒకప్పుడు ప్రజల పార్టీ అయితే ఇప్పుడది ఒక కుటుంబానికి చెందిన పార్టీగా మారిపోయిందని విశే్వశ్వర రెడ్డి ఆరోపించారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రజలకు పూర్తిగా దూరమైపోయిందని ఆయన అన్నారు. ప్రాథమిక ఓటర్లందరు పార్టీకి దూరమైపోయారని విశే్వశ్వర రెడ్డి తెలిపారు. ఇలావుండగా ఇతర పార్టీలకు చెందిన మరికొందరు నాయకులు కూడా త్వరలోనే కాంగ్రెస్‌లో చేరతారని కుంతియా చెప్పారు. అయితే వారు ఎవరనేది వెల్లడించటం సాధ్యం కాదని అన్నారు.
చిత్రం..ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమైన విశే్వశ్వర రెడ్డి