జాతీయ వార్తలు

రసవత్తరం.. ప్రతిష్టాత్మకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, నవంబర్ 21: రెండు దశాబ్దాల కాలంగా పెండింగ్‌లోవున్న రైలుమార్గం రాజస్థాన్‌లోని టోంక్ అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార, విపక్ష పార్టీలకు ఎన్నికల ప్రధానాస్త్రంగా మారింది. ఈ కీలక నియోజకవర్గం నుంచే ఈ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి అభ్యర్థిగా సచిన్‌పైలెట్, బీజేపీకి చెందిన రాష్ట్ర మంత్రి యూనస్ ఖాన్ తలపడుతున్నారు. జైపూర్, అజ్మేర్, సావైమాహోపూర్‌లకు టోంక్ నియోజకవర్గం సరిహద్దు ప్రాంతంగా ఉంది. ఆ ప్రాంతాల నుంచి టోంక్‌కు నేరుగా రైలుమార్గం నిర్మిస్తామంటూ ప్రతి ఎన్నికల్లో అభ్యర్థులు హామీలివ్వడం దాదాపు దశాబ్థకాలంగా ఈ నియోజకవర్గ ప్రజలకు పరిపాటిగా మారింది. ముస్లిం జనాభా అధిక సంఖ్యలో ఉన్న ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి సచిన్ పైలెట్‌తోబాటు, యూనస్ ఖాన్‌కూడా స్ధానికేతరులే. ఈ నియోజకవర్గంలో అధికార బీజేపీ శాసన సభ్యుడు అజిత్ సింగ్ మెహతాకు దీటుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత సచిన్ పైలెట్‌ను అభ్యర్థిగా ప్రకటించడంతో వెంటనే బీజేపీ అధిష్టానం తన వ్యూహాన్ని మార్చుకుని సిట్టింగ్ ఎమ్మెల్యే స్ధానంలో యూనస్ ఖాన్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. ముఖ్యమంత్రి వసుంధర రాజే బీజేపీ అభ్యర్థిగా రంగంలోవున్న జాల్రాపటన్ నియోజకవర్గంలో బీజేపీ వృద్ధనేత జస్వంత్ సింగ్ తనయుడు మన్వీంద్ర సింగ్‌ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించిన ఆ పార్టీ అధిష్టానం వ్యూహానికి టోంక్ నియోజకవర్గంలో యూనస్ ఖాన్‌ను రంగంలోకి దింపడం ద్వారా సరైన సమాధానం ఇచ్చామని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. ఈ ప్రాంతానికి రాష్ట్ర రాజధాని నుంచి రైలుమార్గ నిర్మాణాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన సమస్యగా పరిగణించి సత్వర పరిష్కారానికి కృషి చేస్తుందని సచిన్ పైలెట్ తెలిపారు. తాను అజ్మేర్ పార్లమెంట్ స్థానం నుంచి గెలిచాక కిషాన్‌గర్ విమానాశ్రయ ప్రాజెక్టు ప్రారంభించానని, అనేక కొత్త రైళ్లను ఆ ప్రాంతానికి తీసుకొచ్చానని గుర్తుచేస్తూ, అదేవిధంగా టోంక్ రైలు మార్గం నిర్మాణ స్వప్నాన్నీ సాకారం చేస్తానని పైలెట్ హామీ ఇస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా సుమారు 5లక్షల కిలోమీటర్ల దూరం రోడ్డుమార్గం ద్వారా ప్రయాణించి ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన వౌలిక వసతులపై అధ్యయనం చేశానన్నారు. మంగళవారం నాడు పది గ్రామ పంచాయతీల్లో పర్యటించానని, అలాగే టోంక్‌లోని రహదార్ల పరిస్థితికూడా చాలాదారుణంగా ఉందని ఆయన చెప్పారు. కాగా మొత్తం 2.22 లక్షల ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో 70వేల మంది ముస్లిం ఓటర్లున్నారు. ‘నిజానికి టోంక్ నాకు మంచి నియోజకవర్గం. గతంలో దౌసా, అజ్మేర్ లోక్‌సభ సభ స్ధానాల నుంచి ప్రాతినిథ్యం వహించిన ఈ ప్రాంతంతో మంచి సంబంధాలున్నాయి’ అని సచిన్ పైలట్ అంటున్నారు.

చిత్రం..జైపూర్‌లో జరిగిన ఒక ఎన్నికల ప్రచార సభలో పాల్గొని,
ప్రజలకు అభివాదం చేస్తున్న కాంగ్రెస్ నేత, పార్టీ గెలిస్తే సీఎంగా ఎంపికయ్యే అవకాశాలున్న సచిన్ పైలట్